కొత్త కొలువులకూ రూపాయి దెబ్బ

2 Sep, 2013 01:29 IST|Sakshi
కొత్త కొలువులకూ రూపాయి దెబ్బ
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ముఖ్యంగా భారత్‌లో కొత్త ఉద్యోగవకాశాలు ఏమంత ఆశావహంగా లేవని నిపుణులంటున్నారు. రూపాయి పతనమే దీనికి ప్రధాన కారణమని వారంటున్నారు. అయితే ముందు ముందు పరిస్థితులు మరింత అద్వానం అవుతాయని వారు హెచ్చరిస్తున్నారు. అంతకంతకూ బలహీనపడుతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రూపాయి పతనం వంటి అంశాలు కంపెనీల లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో కంపెనీల ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తమై, ఆ ప్రభావం ఉద్యోగ నియామకాలపై పడుతోంది. 
 
 ఉద్యోగులను తగ్గించుకోవాలనుకునే ఆలోచన్లేవీ కంపెనీలకు లేవని, అయితే కొత్త ఉద్యోగులను చేర్చుకోవడంపైననే కంపెనీలు ఆచి తూచి వ్యవహరిస్తున్నాయని టవర్స్ వాట్సన్ ఇండియా టాలెంట్ అండ్ రివార్డ్స్ డెరైక్టర్ సుబీర్ బక్షి చెప్పారు. క్యాంపస్ హైరింగ్‌ల జోరు కూడా తగ్గవచ్చని వివరించారు. సాధారణంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆగస్ట్-నవంబర్ కాలం కీలకమైనదని, కానీ ఈ ఏడాది అలాంటిదేమీ లేదని ఆయన పేర్కొన్నారు. రూపాయి పతనం కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయని, హైరింగ్ తగ్గుతుం దని జెనిసిస్ సీఈవో ప్రశాంత్ లోహియా చెప్పారు. 
>
మరిన్ని వార్తలు