28వేల దిగువకు పసిడి?

29 Nov, 2016 08:57 IST|Sakshi
28వేల దిగువకు పసిడి?

ముంబై: డీమానిటైజేషన్  ఎఫెక్ట్ తో  బంగారం  పరుగుకు  పగ్గాలు పడనున్నాయి. నవంబర్ 8న  పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం  వివిధ రంగాలపై అనుకూల, సానుకూల ప్రభావాన్ని చూపనుంది.  ఈ క్రమంలో దేశీయ  బంగారం ధరలు క్రమంగా దిగిరానున్నాయి. కొనుగోలు దారుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో పసిడి ధరలు డిసెంబర్ తరువాత  పది గ్రా. పసిడి ధర రూ28,000 క్రిందికి దిగిరావచ్చని అంచనా వేస్తున్నారు  డీమానిటైజేషన్ ప్రభావంతో బంగారం ధరలు గణనీయంగా పడిపోనున్నాయని,  ప్రస్తుతం రూ.28,750 (పది గ్రాములు) గా ఉన్న ధరలు రూ 28,000 (పది గ్రాములు)  కిందికి పడిపోనున్నాయంటున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు వివిధ రంగాల మార్కెట్ పై తీవ్ర  ప్రభావం చూపిందని విశ్లేషకుల అంచనా.  ముఖ్యంగా ముంబై  ప్రఖ్యాత బంగారం మార్కెట్  జవేరీ బజార్ లో  సగటున  విక్రయాల నమోదు భారీగా  క్షీణించింది.  నోట్ద రద్దు తర్వాత రోజూ సగటున రూ 125 కోట్లుగా ఉండే అమ్మకాలు  ప్రస్తుతం రూ .13 కోట్ల విలువ పడిపోయిందని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.  పాత బంగారం రీ  సైకిల్,   పెళ్లిళ్ల సందర్భంగా నెలకొన్న స్వల్ప కొనుగోళ్లు తప్ప పెద్దగా  విక్రయాలు లేవని,  డిమాండ్  గణనీయంగా తగ్గిందని ముంబై జ్యువెలర్స్ అసోసియేషన్ వైస్ ఛైర్మన్  కుమార్ జైన్ చెప్పారు. 

అలాగే  నల్లకుబేరులు ఎక్కువగా బంగారం కొంటున్నారన్న నివేదికల నేపథ్యంలో  ఐటీ దాడుల భయం కూడా తమని వెంటాడుతున్నట్టు వర్తకులు చెబుతున్నారు.అయితే నవంబరు డిశెంబరు నెలల్లో దేశవ్యాప్తంగా సుమారు 29 వేల పెళ్లిళ్లు జరగుతాయని, ఈ అంచనాలతోనే జవేరీ బజార్  లో 70 టన్నుల బంగారాన్ని స్టాక్  ఉంచుకున్నారు. సాధారణంగా త్రైమాసికంగా 30 టన్నులు బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకుంటారు. కాగా డాలర్  ధరలు బాగా పుంజుకోవడంతో దేశంలో విలువైన లోహాలైన బంగారం, వెండి ధరలు స్తబ్దుగా ఉన్నాయి. అయితే సోమవారం డాలర్ కొద్దిగా  వెనక్కి తగ్గడంతో వెండి, బంగారం ధరలు స్వల్పంగా  పెరిగాయి.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు