పాకిస్థాన్ కు భారత్ తీవ్ర నిరసన

16 Jul, 2015 09:29 IST|Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దులో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పాక్ పదే పదే ఉల్లంఘనకు పాల్పడడంపై పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కు కేంద్రం తీవ్ర నిరసన తెలిపిందని ప్రభుత్వ వర్గాలు గురువారం వెల్లడించాయి.

జమ్మూ జిల్లాలోని అక్నూర్ సెక్టార్ లో పాక్ బలగాలు బుధవారం జరిపిన కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు సైనికులు ఉన్నారు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ బలగాలు పదే పదే కాల్పులకు దిగుతున్నాయి. నిన్నటి దాడిలో 5 భారత సైనిక స్థావరాలను పాక్ బలగాలు లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు