ఎన్నారై సీఈవోపై లంచాల కేసు

22 Jul, 2014 10:44 IST|Sakshi
ఎన్నారై సీఈవోపై లంచాల కేసు

తన కంపెనీల షేర్లను కొనడానికి లంచాలు ఇచ్చిన కేసులో అమెరికాలోని రెండు కంపెనీలకు సీఈవోగా వ్యవహరిస్తున్న ఓ ఎన్నారైపై నేరం రుజువైంది. కాలిఫోర్నియాకు చెందిన శైలేష్ షా (48) తాను ఎలాంటి నేరం చేయలేదని అమెరికా జిల్లా జడ్జి రిచర్డ్ స్టీర్న్స్ ఎదుట వాదించారు. ఆయనను ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో శిక్ష విధిస్తారు. దాదాపు 20 ఏళ్ల పాటు జైలుశిక్ష, తర్వాత విడుదల చేసిన తర్వాత కూడా మూడేళ్ల పాటు పర్యవేక్షణ, 2.50 లక్షల డాలర్ల జరిమానా ఆయనకు విధించే అవకాశం ఉందని ఎఫ్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

తన కంపెనీలో షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ప్రతినిధి ఒకరికి రహస్యంగా లంచాలు ఇచ్చేందుకు శైలేష్ షా అంగీకరించినట్లు నేరం రుజువైంది. అయితే, ఆ ప్రతినిధి అండర్కవర్లో ఉన్న ఎఫ్బీఐ ఏజెంటు అన్న విషయం షాకు తెలియదు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిగింది. స్టాక్ మార్కెట్లలో అక్రమాలను నిరోధించేందుకు మార్గాలు కూడా ఈ విచారణలోనే వెతికారు.

>
మరిన్ని వార్తలు