‘ఆయన నుంచి విడాకులు కావాలి’

17 Jan, 2017 17:15 IST|Sakshi
‘ఆయన నుంచి విడాకులు కావాలి’

ముంబై: షీనా బోరా హత్య కేసులో మరో ట్విస్ట్. ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా తన భర్త పీటర్ ముఖర్జియా నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్టు కోర్టుకు తెలిపారు. విడాకులకు దరఖాస్తు చేసేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనికి ట్రయల్ కోర్టు అనుమతి అవసరం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. షీనా బోరా హత్య కేసులో తనను పీటర్ ఇరికించారని భావిస్తున్న ఇంద్రాణియా ఆయన నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

అంతకుముందు ఆమె తన మొదటి నుంచి సంజీవ్‌ ఖన్నా నుంచి విడిపోయారు. తర్వాత మీడియా ప్రముఖుడు పీటర్ ముఖర్జియాను పెళ్లాడారు. పీటర్, మాజీ భర్తతో కలసి సొంత కూతురు షీనా బోరాను హత్య  చేసినట్టు ఇంద్రాణి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో మంగళవారం చార్జిషీటు దాఖలైంది. ఫిబ్రవరి 1 నుంచి కోర్టులో విచారణ మొదలవుతుంది.

మరిన్ని వార్తలు