మంత్రి గారి కొడుకు కోసం విమానం వెనక్కి..

7 Mar, 2014 12:29 IST|Sakshi

రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవేంటి అంటారు. లెబనాన్న రాజధాని బీరూట్ నగరంలో అచ్చం ఇలాగే జరిగింది. మనలాంటి వాళ్లు ఎవరైనా వెళ్లడం ఐదు నిమిషాలు ఆలస్యమైతే కనీసం సిటీబస్సు కూడా ఆగదు. కానీ, అక్కడ ఓ మంత్రిగారి కొడుకు కోసం ఏకంగా అప్పటికే ఎగిరిపోయిన విమానాన్ని కూడా వెనక్కి రప్పించారు. సాధారణంగా విమానం బయల్దేరే ముందే ఎవరైనా ప్రయాణికులు రాకపోతే వాళ్ల పేర్లతో సహా ప్రకటన చేస్తారు. మిడిల్ ఈస్ట్ ఎయిర్ లైన్స్ సిబ్బంది కూడా అదే చేశారు.  కానీ ఆ విమానం ఎక్కడానికి చివరిగా రావాల్సింది ఇటలీ మంత్రిగారి కుమారుడు.

 

విమానం బయల్దేరాక ఎయిర్ పోర్ట్ కి వచ్చిన ఇరాక్ రవాణా మంత్రి హది అల్ అమిరి కుమారుడు మహ్మది ఆల్ అమిరి గందరగోళం సృష్టించాడు. విమానం సిబ్బందితో ఘర్షణకు దిగుతూ విమానాన్ని తిరిగి రప్పించకపోతే అది బాగ్దాద్ లో దిగదని  హెచ్చరించాడు. అంతేకాదు, అప్పటికే బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ మేనేజర్ ఆ విమానానికి క్లియరెన్స్ లేదని మిడిల్ ఈస్ట్ ఎయిర్ లైన్స్ కు ఫోన్ చేశారు. దీంతో కంగుతిన్న మిడిల్ ఈస్ట్ విమాన అధికారులు ఆ విమానాన్ని తిరిగి బీరూట్ కు రప్పించారు. ఇరాక్ మంత్రిగారి దెబ్బంటే అదీ!!

మరిన్ని వార్తలు