సింధురత్న ప్రమాదం మానవ తప్పిదమే | Sakshi
Sakshi News home page

సింధురత్న ప్రమాదం మానవ తప్పిదమే

Published Fri, Mar 7 2014 12:17 PM

ప్రమాదానికి గురైన ఐఎన్ఎస్ సింధురత్న

ముంబై తీరంలో గత బుధవారం ఐఎన్ఎస్ సింధురత్న జలాంతర్గామిలో చోటు చేసుకున్న ప్రమాదం మానవ తప్పిదమేనని ప్రాధమిక విచారణలో వెల్లడైందని రక్షణ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. జలాంతర్గామిలోని మూడో కంపార్ట్మెంట్లో్ని కేబుళ్లు, బ్యాటరీల నుంచి విష వాయువులు ఒక్కసారిగా వెలువడి ఆ గది అంతా వ్యాపించాయని తెలిపారు. ఆ విషవాయువులు పీల్చడంతో ఇద్దరు నావికులు లెఫ్టినెంట్ కపిశ్ మున్వల్, లెఫ్టినెంట్ మనోరంజన్ కుమార్‌లు మరణించగా,  మరో ఏడుగురు నావికులు తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారని చెప్పారు. భారత్ లో ఉన్న జలాంతర్గాములన్నీ దాదాపు 20 ఏళ్ల నాటివని ఈ సందర్బంగా తెలిపారు. సింధురత్న 26 ఏళ్ల క్రితం తయారైందని రక్షణ శాఖ ఉన్నతాధికారులు గుర్తు చేశారు.

 

యుద్ధనౌకలు తరచూ ప్రమాదాల బారిన పడుతుండటం, తాజాగా సింధురత్న ఘటన చోటుచేసుకోవడంతో.. నైతిక బాధ్యత వహిస్తూ నేవీ చీఫ్ అడ్మిరల్ డి.కె.జోషి బుధవారం నాడే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గతంలో ముంబై తీరంలో ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదానికి గురైంది. అందులో భారీ పేలుళ్లు, అగ్నిప్రమాదం సంభవించడంతో 18 మంది సిబ్బంది మరణించిన విషయం విదితమే.

Advertisement
Advertisement