చరిత్రాత్మక విజయమిది

12 Mar, 2017 03:56 IST|Sakshi
చరిత్రాత్మక విజయమిది

యూపీ, ఉత్తరాఖండ్‌ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ
- మాపై ప్రజలు చూపిన నమ్మకానికి కృతజ్ఞతలు చెబుతున్నా..
- ప్రతి క్షణం దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తాం


న్యూఢిల్లీ:
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం చరిత్రాత్మకమని.. ఇది తమకు గర్వకారణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రజలు తమపై చూపిన నమ్మకానికి, ఇచ్చిన మద్దతుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ఖాయమైన అనంతరం మోదీ ట్వీటర్‌లో వరుసగా ట్వీట్‌లు చేశారు.‘‘అన్ని వర్గాల ప్రజల నుంచి బీజేపీకి అనూహ్యమైన మద్దతు లభించడం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా యువత నుంచి భారీగా మద్దతు లభించ డం ఆనందంగా ఉంది. బీజేపీ పట్ల చూపిన నమ్మకానికి, మద్దతు పట్ల దేశ ప్రజ లకు ధన్యవాదాలు తెలుపుతున్నా. చరిత్రాత్మక, గర్వకారణమైన విజయమిది. 125 కోట్ల మంది భారతీయుల శక్తిసామర్థ్యాలపై మాకు నమ్మకముంది. ప్రతి క్షణం దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే కృషి చేస్తాం..’’ అని మోదీ పేర్కొ న్నారు.

ఘన విజయం అందించిన ఉత్తరప్రదేశ్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను కాశీ (వారణాసి) నుంచి ఎన్నికైనవాడి నని, తనపై ప్రేమ చూపించిన కాశీ ప్రజ లకు తల వంచి అభివా దం చేస్తున్నానని పేర్కొ న్నారు. ఇక ఉత్తరాఖం డ్‌లో బీజేపీ విజయం ప్రత్యేక మైనదని మోదీ వ్యాఖ్యానించారు. పూర్తి నిబద్ధతతో అత్యుత్తమ పాలన అందిస్తామని ఆ రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. అటు బీజేపీ–అకాలీదళ్‌ కూటమికి పదేళ్లపాటు పాలించే అవకాశం ఇచ్చిన పంజాబ్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఇక తాజా విజయాలతో బీజేపీని కొత్త శిఖరాలకు చేర్చారంటూ పార్టీ జాతీయా ధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ ఆఫీసు బేరర్లు, రాష్ట్రాల నాయకులను మోదీ ప్రశంసిం చారు. బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిర్విరామంగా కృషి చేసి, ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారని అభినందించారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక సారీలుండవ్‌.. అన్నీ అటాక్‌లే : తమన్నా

శంకర్‌ దర్శకత్వంలో షారూఖ్‌ !

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా

అంతం అన్నింటికీ సమాధానం కాదు

ఏంటి శ్రద్ధా అంత గట్టిగా తుమ్మావా?

శ్రీదేవి కల నెరవేర్చాను : బోనీ కపూర్‌