న్యాయమూర్తి అయినా సరే...

20 Aug, 2014 18:36 IST|Sakshi
న్యాయమూర్తి అయినా సరే...

ముంబై: న్యాయమూర్తి అయినా సరే సస్పెన్షన్కు అతీతుడు కాదు. నేరం చేస్తే శిక్ష అనుభవించవలసిందే.  మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న నేరారోపణలపై  ఒక సెషన్స్ కోర్టు న్యాయమూర్తిని బాంబే హైకోర్టు సస్పెండ్ చేసింది. దక్షిణ ముంబైలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.టి. గైక్వాడ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఒక మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసింది.

ప్రాధమిక విచారణ అనంతరం గైక్వాడ్ను సస్పెండ్ చేసినట్లు బాంబే హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ శాలినీ జోషి చెప్పారు. ప్రాధమిక విచారణ సమయంలో ఇతర ఉద్యోగులు కూడా బాధితురాలికి మద్దతు పలికినట్లు హైకోర్టు వర్గాలు తెలిపాయి. శాఖాపరమైన విచారణ ముగిసిన తరువాత ఆ న్యాయమూర్తిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు