విమానాల్లో తెగ తిరిగేశారు!

18 Aug, 2015 20:30 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయ విమానాలలో ప్రజారవాణా జులై నాటికి 29 శాతం మేర పెరిగినట్లు అధికారక సమాచార విభాగం మంగళవారం వెల్లడించింది. ప్రయాణికులను చేరవేసే క్రమంలో స్పైస్ జెట్ రవాణా 93.4 శాతం ముందుంజలో ఉందని పేర్కొంది. దాంతో మొత్తంగా దేశీయ విమానాలు తమ రవాణాలో 67.45 లక్షల ఆదాయాన్ని రాబట్టినట్టు పేర్కొంది. స్పైస్ జెట్ సౌకర్యాలు ప్రయాణికులను అమితంగా ఆకట్టుకోవడంతో వాటికి రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోందని తెలిపింది. గత సంవత్సరంతో పోలిస్తే గడిచిన నెలలో దేశీయ విమానాల రవాణా 52.16 లక్షలకు చేరిందని పేర్కొంది.

గత సంవత్సరం జనవరి, జులై మధ్య మాసాల్లో 21.13 శాతం మేర ఆదాయం రూ. 376.28 లక్షలు రాబట్టగా,  2015వ సంవత్సరంలో వచ్చిన ఆదాయం రూ. 455.78 లక్షలు పెరిగినట్టు గణాంక విశ్లేషణలో వెల్లడైంది. గత సంవత్సరం జూన్లో 56.89 లక్షలు ఉంటే,  ఇప్పుడు 66.01 లక్షలకు చేరింది. కాగా, ఈ సంవత్సరం జూన్లో ప్రయాణికుల రవాణా 16.03 శాతానికి పెరిగింది.

మరిన్ని వార్తలు