సత్యరాజ్‌ క్షమాపణపై కమల్‌ స్పందన

22 Apr, 2017 15:03 IST|Sakshi
సత్యరాజ్‌ క్షమాపణపై కమల్‌ స్పందన

 చెన్నై:తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య కావేరీ జలాలపై కట్టప్ప వ్యాఖ్యలు-బాహుబలి వివాదం నేపథ్యంలో సత్యరాజ్‌  కన్నడిగులకు  క్షమాపణ చెప్పడంపై  నటుడు, దర్శకుడు కమల్‌హాసన్‌ స్పందించారు.  కమల్‌ సత్యరాజ్‌కు  శనివారం ట్విట్టర్‌ ద్వారా  అభినందనలు తెలిపారు. సత్యరాజ్‌  గొప్ప మానవుడని కొనియాడారు. "సంక్లిష్ట వాతావరణంలో హేతుబద్ధతను కాపాడిన  సత్యరాజ్‌కు అభినందనలు" అని ఆయన పేర్కొన్నారు.  ఈ సందర్భంగా తన సినిమా విరుమాందిలోని క్షమాపణ కోరినవాడే గొప్పమానవుడు అన్న మాటలను ఉటంకించారు.

మరోవైపు  తమిళనాడు బీజేపీ నాయకుడు, మాజీ ఎంఎల్‌ఏ రాజా  సత్యరాజ్‌, కమల్‌ హాసన్‌లపై  మండిపడ్డారు. వారికి డబ్బుమీద ధ్యాస తప్ప తమిళుల మీద  ప్రేమ లేదని   ట్విట్టర్‌ లో ధ్వజమెత్తారు.  వారు డబ్బు గురించి మాత్రమే బాధపడతారు , తమిళనాడు,  తమిళ  సెంటిమెంట్‌పై వారికి పైపైన ప్రేమ మాత్రమేనేని విమర్శించారు.  డబ్బు కోసం  ఆత్మగౌరవంలేని చర్య గా ఆయన అభివర్ణించారు.

కాగా తొమ్మిదేళ్ళ క్రితం సినీ నటుడు సత్యరాజ్‌, కావేరీ జలాల వివాదంపై  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.  అంతేకాదు ఈ వివాదం 'బాహుబలి'  (ది కన్‌క్లూజన్‌) సినిమా విడుదలకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో దర్శకుడు  రాజమౌళి  సత్యరాజ్‌  తరపున క్షమాపణలు  చెప్పారు. అయినా సత్యరాజ్‌ క్షమాపణలు చెప్పాల్సిందే అని  కన‍్నడిగులు  పట్టుబట్టడంతో  కర్నాటక ప్రజలపై  తనకెప్పుడూ చిన్న చూపు లేదనీ, తనవ్యాఖ్యలకు ఎవరైనా బాధపడి వుంటే క్షమించమంటూ సత్యరాజ్‌  కోరిన సంగతి తెలిసిందే.

 

మరిన్ని వార్తలు