రూ.2 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్గా ఇచ్చిందట..!

6 Feb, 2017 08:55 IST|Sakshi
రూ.2 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్గా ఇచ్చిందట..!

ముంబై: బాలీవుడ​ హీరోయిన్​ కంగనా రనౌత్ తన  గురువుగారికి  ఖరీదైన గురుదక్షిణ చెల్లించుకున్నారు. యోగా గురు  సూర్య నారాయణ సింగ్ కు  సుమారు రూ.2 కోట్ల విలువైన ఫ్లాట్ కానుకగా  ఇచ్చారు.  బాలీవుడ్ లో రంగ ప్రవేశానికి ముందు  నుంచీ   తనకు  శిక్షణనిస్తున్న గురువు పట్ల  ఈ క్వీన్ తన విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు.  ఆయన కోసం ఏదైనా చేయాలని అనుకున్న కంగనా  ప్రత్యేక  శ్రద్ధ తీసుకుని  మరీ ఈ ఇంటిని తీర్చిదిద్దినట్టు సమాచారం.

ఒక యోగా కేంద్రం ప్రారంభించేందుకు వీలుగా,  ముంబైలోని అంధేరి వెస్ట్ లోని డబుల్  బెడ్ రూం ఫ్లాట్ ని  కంగన గురువు గారికి  బహుకరించారు . యోగా శిక్షణకు అనువుగా ఉండేలా,    కంగనా స్పెషల్   కేర్ తీసుకున్నారు.  విశాలమైన బాల్కనీ సహా, అన్ని  సౌకర్యాలతో  మంచి యోగా సెంటర్ గా తీర్చిదిద్దారట.  దీనికోసం కొన్ని రోజుల క్రితం  కాంట్రాక్టర్ తో  సంప్రదించి మరీ ఈ అపార్ట్ మెంట్ ను   రూపొందించారట.  

కాగా  బాలీవుడ్ రంగప్రవేశం ముందు జుహు బీచ్లో జిమ్నాస్టిక్స్  చేసుకుంటున్న సూర్యనారాయణ సింగ్  (సుమారు  18  ఏళ్ల వయస్సులో)  కంగనాను ఆకట్టుకున్నారు. అప్పటినుంచి ఆయన యోగా శిక్షణలో తనను తాను మలుచుకున్నారు కంగనా. ప్రస్తుతం   విశాల్ భరద్వాజ్   దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ రంగూన్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నసంగతి తెలిసిందే.

 

>
మరిన్ని వార్తలు