శబరిమలలో కలకలం

26 Jun, 2017 16:49 IST|Sakshi
శబరిమలలో కలకలం

తిరువనంతపురం: కేరళలోని సుప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయంలో ఆదివారం ప్రతిష్టించిన బంగారు పూత ధ్వజస్తంభం ధ్వంసం కావడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 9.16 కిలోల బంగారం, 300 కిలోల రాగి, 17 కిలోల వెండితో తయారైన ధ్వజ స్తంభాన్ని ఉదయమే ఆలయ ప్రధాన అర్చకుడు ప్రతిష్టించారు. దాని అడుగుభాగం ధ్వంసమైనట్లు సాయంత్రం గుర్తించారు. సీసీటీవీ కెమెరాల్లో... ముగ్గురు పాదరసాన్ని ధ్వజస్తంభం అడుగు భాగంలో చల్లుతున్నట్లు కనిపించింది. నిందితులను పోలీసులకు అప్పగించామని దేవస్థానం బోర్డు అధ్యక్షుడు గోపాలకృష్ణన్‌ చెప్పారు.

రూ. 3.5 కోట్ల ఖర్చుతో తయారు చేసిన ఈ ధ్వజస్తంభాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త ఆలయానికి విరాళంగా ఇచ్చారు. వ్యాపారంలో ఆయన ప్రత్యర్థులే ఈ పని చేయించివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శబరిమల ఆయలంలో ఈ నెల 28 నుంచి పది రోజుల ఉత్సవాలు నిర్వహించారు. జూలై 7 ఆలయాన్ని మూసివేయనున్నారు.

మరిన్ని వార్తలు