కుట్రపన్ని కాల్చి చంపారు: సీపీఎం

8 Apr, 2015 18:58 IST|Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణలో జరిగిన ఐదుగురు అండర్ ట్రయల్ ఖైదీల ఎన్కౌంటర్ బూటకమని సీపీఎం పేర్కొంది. పోలీసులు ముందుగానే కుట్ర పన్ని వారిని కాల్చిచంపారని చేశారని ఆరోపించింది. ఈ ఘటనను సిగ్గుమాలిన చర్యగా వర్ణించింది. సిమి తీవ్రవాదులు ఇద్దరు పోలీసులను కాల్చిచంపినందుకు ప్రతీకారంగా ఈ ఎన్కౌంటర్ చేశారని ఆరోపించింది. చేసిన తప్పును కప్పిపుచ్చుకోలేరని పేర్కొంది.

ఈ కాల్పుల ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని, బాధ్యులైన పోలీసుల నుంచి వివరణ తీసుకోవాలని డిమాండ్ చేసింది. తీవ్రవాది వికారుద్దీన్ సహా ఐదుగురు ఖైదీలను నల్లగొండ జిల్లాలో పోలీసులు మంగళవారం ఎన్కౌంటర్ చేశారు.

మరిన్ని వార్తలు