తప్పతాగి కేంద్రమంత్రికి ట్వీట్‌ చేసినందుకు..!

21 Mar, 2017 18:17 IST|Sakshi
తప్పతాగి కేంద్రమంత్రికి ట్వీట్‌ చేసినందుకు..!
న్యూఢిల్లీ: తాగిన మత్తులో కేంద్ర రైల్వేమంత్రి సురేశ్‌ ప్రభుకు తప్పుడు ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి జైలుపాలయ్యాడు. మధ్యప్రదేశ్‌ దేవాస్‌కు చెందిన ప్రయాస్‌ తరావీ ఆదివారం రాత్రి రైల్వేమంత్రి సురేష్‌ ప్రభుకు ట్వీట్‌ చేశాడు. భింద్‌-ఇండోర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో టికెట్‌ ఎగ్జామినర్‌ (టీటీఈ), రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌)కు చెందిన సిబ్బంది తనతో తప్పుగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై సత్వరమే స్పందించిన కేంద్రమంత్రి ప్రభు.. దీనిని భోపాల్‌లోని ఆర్పీఎఫ్‌ కమాండెంట్‌కు బదిలీ చేశారు. దీంతో ఆర్పీఎఫ్‌ ఎస్సై గోపాల్‌ మీనా వెంటనే రంగంలోకి దిగి శివపురి వద్ద రైలులో తనిఖీలు నిర్వహించారు.

దీంతో తరావీ ఫిర్యాదు తప్పు అని తేలింది. ఆ సమయంలో థర్డ్‌ అతను తాగిన మత్తులో ఉన్నట్టు గుర్తించారు. అంతేకాకుండా రైలులోని సహ ప్రయాణికులపై అతడు తప్పుగా ప్రవర్తించినట్టు తేలింది. దీంతో సహ ప్రయాణికుల వాంగ్మూలం మేరకు తరావీపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేసినట్టు గోపాల్‌ మీనా తెలిపారు. మద్యంలో మత్తులో ఉన్న ఆయన టికెట్‌ చూపించాలని టీటీఈ కోరినా వినిపించుకోలేదని, అంతేకాకుండా తనతో తప్పుగా ప్రవర్తించాడని ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశాడని మీనా వెల్లడించారు. 
మరిన్ని వార్తలు