సంచలనాల 'నాగిని' మాట్లాడితే..

8 Oct, 2016 19:52 IST|Sakshi
నిర్మాత ఏక్తా కపూర్ తో 'నాగిన్‌' మౌనీ రాయ్

ముంబై: అటు హిందీలో సూపర్ హిట్ అయి.. ఇప్పుడు దక్షణాది భాషల్లో ప్రసారం అవుతూ సంచలనాలు సృష్టిస్తోంది 'వేటాడే నాగిని'(హిందీలో 'నాగిన్') సీరియల్. నాగిన్ లో ప్రధాన పాత్ర పోశించిన మౌనీ రాయ్.. నాగిన్-2లోనూ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఇటీవలే ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన మౌనీ రాయ్.. 'నాగిన్' నిర్మాత ఏక్తా కపూర్ పై పొగడ్తల వర్షం కురిపించింది. 'కథా చర్చ ఉందని ఏక్తా కబురు పెడితే చాలు.. వెంటనే అక్కడ వాలిపోతా. ఎందుకంటే ఏక్తా కథ చెప్పే విధానం, కొత్త పాత్రలను సృష్టించే తీరు అద్భుతంగా ఉంటుంది. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ టెల్లర్' అంటూ మౌనీరాయ్ గలగలా మాట్లాడేసింది.

కలర్స్ చానెల్ లో 2015 నవంబర్ 1 నుంచి ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారమైన నాగిన్ సీరియల్.. 2016 జూన్ లో ముగిసింది. దానికి కొనసాగింపుగా రూపొందించిన 'నాగిన్-2' అక్టోబర్ 8 నుంచి అదే చానెల్ లో ప్రసారం కానుంది. జూన్ నుంచి తెలుగు సహా తమిళ, మలయాళ భాషల్లోనూ లో ప్రసారం అవుతోన్న 'వేటాడే నాగిని' ముగియగానే రెండో భాగాన్ని కూడా డబ్ చేసేందుకు నిర్మాతలు ప్రణాళికలు రూపొందించారు. తొలి భాగంలానే 'నాగిన్-2'ను కూడా 62 ఎపిసోడ్లుగా ప్రసారంచేయాలనుకుంటున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు