టాటా-మిస్త్రీ వివాదంలో కొత్త ట్విస్ట్

2 Nov, 2016 09:15 IST|Sakshi
టాటా-మిస్త్రీ వివాదంలో కొత్త ట్విస్ట్
ముంబై : సైరస్ మిస్త్రీ-రతన్ టాటా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న నేపథ్యంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మిస్త్రీ పనితీరు బాగాలేదంటూ.. కంపెనీ ఉజ్వల భవిష్యత్తు కోసం ఆయన్ను తొలగించామంటూ రతన్ టాటా తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండగా.. నాలుగు నెలల ముందే ఆయన పనితీరును టాటా సన్స్ బోర్డు వేతనకమిటీ కీర్తించిన సంగతిని మాజీ చైర్మన్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.. మిస్త్రీని తొలగించడానికి నాలుగు నెలల ముందు అంటే జూన్ 28న భేటీ అయిన వేతన కమిటీ , చైర్మన్గా మిస్త్రీ ఫర్ఫార్మెన్స్ భేష్గా ఉందని కొనియాడడమే కాక, వేతనాన్ని కూడా పెంచాలని ప్రతిపాదించినట్టు తెలిపాయి.
 
గ్రూప్ కంపెనీల్లో ఆయన అందిస్తున్న గణనీయమైన సహకారానికి గుర్తింపుగా ఏకగ్రీవంగా వేతనాన్ని పెంచాలని నిర్ణయించాయని పేర్కొన్నాయి., మిస్త్రీ బేసిక్ వేతనం, కమిషన్ పెంచాలని టాటా సన్స్ బోర్డుకు ప్రతిపాదించాలని ఈ కమిటీ అంగీకరించినట్టు స్పష్టంచేశాయి.  బోర్డు సైతం పెద్ద మొత్తంలో ఇక్రిమెంట్కు సన్నద్ధమైందని, అయితే మిస్త్రీ దీనికి ఒప్పుకోలేదని తెలిసింది. తన టాప్ టీమ్కు ఇచ్చే మాదిరిగా తన వేతనాన్ని కూడా 6 శాతానికి కంటే మించి పెంచవద్దని మిస్త్రీ పట్టుబట్టారని గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తెలిపింది. మిస్త్రీ సారథ్యంలో ఉన్న ఈ కౌన్సిల్ను ప్రస్తుతం టాటా సన్స్ బోర్డు రద్దు చేసింది. 
 
ఈ కౌన్సిల్లో ముగ్గురు సభ్యులు మధు కన్నన్, నిర్మల్య కుమార్, ఎన్ఎస్ రాజన్లు ఇప్పటికే గ్రూప్ నుంచి వైదొలుగుతూ రాజీనామాలు చేశారు. వీరి నియామకం మిస్త్రీ సారథ్యంలోనే జరిగింది. అర్థాంతరంగా సైరస్ మిస్త్రీని చైర్మన్ పదవిని తొలగించడంతో టాటా గ్రూప్లో ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. టాటా గ్రూప్ ఉజ్వల భవిష్యత్తు కోసమే మిస్త్రీ తొలగించామంటూ రతన్ టాటా తీవ్ర వ్యాఖ్యానాలు చేశారు. మిస్త్రీ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. అయితే తన పనితీరు బాగాలేదనడంలో ఎలాంటి వాస్తవం లేదని మిస్త్రీ సైతం విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం వేతన కమిటీ నాలుగు నెలల కింద మిస్త్రీ పనితీరును కీర్తించిన విషయాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. 
మరిన్ని వార్తలు