ఆల్ టైమ్ గరిష్టంలో నిఫ్టీ

16 Mar, 2017 09:53 IST|Sakshi
ముంబై: ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు తర్వాత, జీఎస్టీ కౌన్సిల్ భేటికి ముందు గురువారం ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు ఆల్ టైమ్ గరిష్టంలో ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ 168.71 పాయింట్ల లాభంలో 29,566 వద్ద, నిఫ్టీ 54.55 పాయింట్ల లాభంలో 9,139 వద్ద ట్రేడవుతున్నాయి. అంచనాలకు అనుగుణంగానే ఫెడరల్ రిజర్వు పావు శాతం వడ్డీరేట్లను పెంచుతున్నట్టు ప్రకటించడంతో ఆసియన్ మార్కెట్లపై పెద్దగా ప్రభావం పడలేదు. దీంతో దేశీయ మార్కెట్లు పాజిటివ్ గానే ట్రేడవుతున్నాయి.  అదానీ పోర్ట్స్, హెచ్యూఎల్, బీహెచ్ఈఎల్, ఎల్ అండ్ టీ,  ఓఎన్జీసీ, హిందాల్కో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 1-3 శాతం లాభపడగా.. హీరో మోటారో కార్పొ అరశాతం మేర పడిపోతుంది.
 
అటు డాలర్ తో రూపాయి మారకం విలువ మరింత బలపడుతోంది. నిన్నటి ముగింపుకు 29 పైసలు లాభపడి 65.40 వద్ద ఎంట్రీ ఇచ్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్కెట్లకు జోషిచ్చాయని విశ్లేషకులు చెప్పారు. రూపాయి సైతం పాజిటివ్ గా ట్రేడవుతుందన్నారు. అంచనాలకు అనుగుణంగా నిర్ణయం రావడంతో ఫెడరల్ రిజర్వు రేట్ల ప్రభావం  ఇటు దేశీయ మార్కెట్లపైనా, అటు ఆసియన్ మార్కెట్లపైనా అంతగా ప్రభావం చూపలేదని పేర్కొన్నారు.  
 
మరిన్ని వార్తలు