హిందువులు కానివారిని అనుమతించొద్దు!

11 Sep, 2014 17:47 IST|Sakshi
హిందువులు కానివారిని అనుమతించొద్దు!

భోపాల్:‘లవ్ జీహాద్’పై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న సమయంలో మరోసారి మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఉషా ఠాకూర్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. త్వరలో ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగే ‘గర్బా’ వేదికల వద్దకు హిందూ యువతను.. అది కూడా ఓటరు గుర్తింపుకార్డు ఉన్న వారినే అనుమతించాలని నిర్వాహకులకు సూచించారు. హిందూ మతంపై నమ్మకం లేని వారిని పాటలు పడటానికీ, నత్యం చేయడానికీ గర్బా వేదికల వద్దకు అనుమతించడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు.

 

దీనిపై రాష్ట్ర హోం మంత్రి బాబూలాల్ గౌర్ ను ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలియదంటూ దాటవేశారు. ఈ అంశంపై తానేమీ స్పందిచలేను. ఆ వ్యాఖ్యలపై ఏమైనా వివరణ కావాలంటే  ఆమెను మాత్రమే అడగండి అంటూ తెలిపారు. అయితే ఉషా ఠాకూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆమె సూచనలు భారత సంప్రదాయాలకు, రాజ్యాంగ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి వ్యాఖ్యలు సమర్థనీయం కాదని స్థానిక కాంగ్రెస్ నేత సత్యదేవ్ కటార్ తెలిపారు. అయితే ఈ వేడుకల్లో పాల్గొనే యువతులు మర్యాదపూర్వక దుస్తులు ధరించేలా చూడాలని నిర్వాహకులను కోరారు.
 

మరిన్ని వార్తలు