ఐఫోన్6, ఐఫోన్6 ప్లస్ ప్రకంపనలు! | Sakshi
Sakshi News home page

ఐఫోన్6, ఐఫోన్6 ప్లస్ ప్రకంపనలు!

Published Fri, Sep 12 2014 11:03 AM

ఐఫోన్6, ఐఫోన్6 ప్లస్ ప్రకంపనలు! - Sakshi

మొబైల్ ఫోన్ ప్రపంచంలో ఆపిల్ ఐఫోన్ మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. మొబైల్ రంగంలో అంతార్జాతీయంగా, ముఖ్యంగా చైనా నుంచి ఎదురువుతున్న పోటీని తట్టుకోవడానికి ఆపిల్ సంస్థ సెప్టెంబర్ 9 తేదీన 'ఐఫోన్6', 'ఐఫోన్ 6 ప్లస్' అనే రెండు ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది.  కొత్తగా విడుదలైన ఐఫోన్లను సొంతం చేసుకోవడానికి మొబైల్ వినియోగదారుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. అయితే ఒకేరోజు విడుదల అయిన ఐఫోన్6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్లలో తేడాలు ఏంటనే ప్రశ్న వినియోగదారుల్లో ఎదురవుతోంది. 
 
కలర్, సైజు:
మార్కెట్ లోకి విడుదలైన ఐఫోన్ గోల్డ్, సిల్వర్, గ్రే కలర్స్ లో అందుబాటులోకి రానున్నాయి. 
ఐఫోన్ స్క్రీన్ డిస్ ప్లే 4.7 ఇంచులు, 6.9 ఎంఎం మందం
ఐఫోన్6 ప్లస్ స్కీన్ డిస్ ప్లే 5.5 ఇంచులు, 7.1ఎంఎం మందం
 
ధర & మెమరీ:
రెండేళ్ల కాంట్రాక్టు తో.. 
ఐఫోన్ 6 - 16 జీబీ (199 డాలర్లు), 64 జీబీ (299 డాలర్లు), 128 జీబీ (399 డాలర్లు) 
ఐఫోన్ 6 ప్లస్ 16 జీబీ (299 డాలర్లు), 64 జీబీ (399 డాలర్లు), 128 జీబీ (499 డాలర్లు) 
 
బ్యాటరీ: 
ఆపిల్ వెబ్ సైట్ లో వెల్లడించిన వివరాల ప్రకారం ఐఫోన్6 3జీ సేవల్లో 14 గంటల టాక్ టైమ్, ఐఫోన్ 6 ప్లస్ 24 గంటల టాక్ టైమ్ తో బ్యాటరీ సేవలందిస్తుందని తెలిపారు. అలాగే 11 గంటల వీడియో ప్లేబ్యాక్, ఐఫోన్ 6 ప్లస్ 14 గంటల వీడియో ప్లే బ్యాక్ సామర్ధ్యం ఉంటుందని తెలిపారు. ఐఫోన్ 5ఎస్ తో పోల్చితే కొత్త మోడల్ లో ఆడియో, వీడియో, వైఫే బ్రౌజింగ్ సామర్ధ్యాన్ని 10 శాతం, 3జీ బ్రౌజింగ్ ను 20 శాతం పెంచినట్టు కంపెనీ వెల్లడించింది. 
 
ఇతర ఆప్సన్స్:
64 బిట్ బిట్ తో మైరుగైన సీపీయూ, జీపీయూ ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. 
 
డిస్ ప్లే: 
ఐఫోన్6 ప్లస్: 1920x1080 మెగా పిక్సల్స్ రెజల్యూషన్, 
ఐఫోన్ 6: 1704x960 మెగా పిక్సల్స్ రెజల్యూషన్
 
ఇలాంటి ప్రత్యేకతలున్న ఐఫోన్ మోడళ్లను భారతదేశంలోని వినియోగదారులు సొంతం చేసుకోవాలంటే అక్టోబర్ 17 తేదీ వరకు ఆగాల్సిందే. యూఎస్, కెనడా, యూకే, ఇతర ఆరు దేశాల్లో మాత్రం సెప్టెంబర్ 19 నుంచి అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబర్ 12 తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని ఆపిల్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement
Advertisement