-

‘డెయిరీ’లోకి ఆయిల్ ఇండియా

30 Dec, 2013 01:37 IST|Sakshi

గౌహతి: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఆయిల్ ఇండియా కంపెనీ పాల ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశిస్తోంది. కంపెనీ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్)లో భాగంగా అసోంలోని రెండు జిల్లాల్లో పాల ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని కంపెనీ యోచిస్తోంది. గుజరాత్‌లోని అమూల్ తరహాలో అసోంలో పాల వ్యాపారంలోకి ప్రవేశించనున్నామని, కామధేను ప్రాజెక్ట్ పేరుతో ఈ కార్యకలాపాలను చేపట్టనున్నామని ఈ ఏడాది జూలైలోనే కంపెనీ సీఎండీ సునీల్ కుమార్ శ్రీవాత్సవ పేర్కొన్నారు.   దీనికి సంబంధించిన అధ్యయనాన్ని నిర్వహించడానికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్, ఆనంద్(ఐఆర్‌ఎంఏ)తో కంపెనీ ఇటీవలనే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

మరిన్ని వార్తలు