యూఎస్లో పాక్ నూతన రాయబారిగా జిలానీ

9 Nov, 2013 09:03 IST|Sakshi

అమెరికాలో పాకిస్థాన్ నూతన రాయబారిగా జలీల్ అబ్బాస్ జిలానీని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గత రాత్రి పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం జలీల్ అబ్బాస్ జిలానీ పాక్ విదేశాంగ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కావున డిసెంబర్ మాసంలో జిలానీ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారని  విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది.

 

గతంలో జిలానీ పాక్ రాయబారిగా బెల్జియం, లక్సింబర్గ్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో పని చేశారని ఈ సందర్భంగా తెలిపింది. అలాగే 1990 -1992 మధ్య కాలంలో పాక్ ప్రధాన మంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేశారని వెల్లడించింది.

మరిన్ని వార్తలు