వాచీ పట్టీతో పేమెంట్‌!

12 Dec, 2016 14:29 IST|Sakshi
వాచీ పట్టీతో పేమెంట్‌!
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా నగదు రహిత లావాదేవీలదే చర్చే. ఏటీఎం, క్రెడిట్, డెబిట్‌ కార్డు, వ్యాలెట్లతో కాకుండా నగదు రహిత లావాదేవీలకు ఇంకో పద్ధతి కూడా ఉంది. దాన్నే నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్స్‌ (ఎన్‌ఎఫ్‌సీ) అంటారు. ఇది కూడా క్రెడిట్, డెబిట్‌ లేదా బ్యాంక్‌ అకౌంట్ల ద్వారానే పనిచేస్తుంది గానీ... ఏ రకమైన స్వైపింగ్, టైపింగ్‌ అవసరం ఉండదు. మీరు చెల్లించాల్సిన బిల్లు కోసం స్వైపింగ్‌ యంత్రంపై మీ స్మార్ట్‌ఫోన్‌ను అలా ఉంచడం.. మీ పిన్‌ నంబర్‌ కొట్టేయడం... అంతే మీరు చేయాల్సింది. 
 
ఇప్పుడు ఫొటోలోని వాచీ సంగతి చూద్దాం. వాచీ మామూలుదే. దాని కింద ఉన్న నల్లటి ప్లాస్టిక్‌ పట్టీని చూశారా? అదీ వావ్‌ అనిపించే అంశం. సిడ్నీకి చెందిన స్టార్టప్‌ కంపెనీ ఇనామో తయారు చేసిన ఈ గాడ్జెట్‌ పేరు ‘కర్ల్‌’! ఇది ఎన్‌ఎఫ్‌సీ చిప్‌తో కూడిన పరికరం. వాటర్‌ ప్రూఫ్‌ కూడా. మీ కార్డు వివరాలను దీంట్లోకి జొప్పించేస్తే... ఎన్‌ఎఫ్‌సీ ఆధారిత పేమెంట్లు చేయడం సులువైపోతుంది. ఒకవేళ ఈ కర్ల్‌ ఎక్కడైనా పోగొట్టుకున్నామనుకోండి. లేదా ఎవరైనా చోరీ చేశారనుకోండి. ఫోన్‌ సిమ్‌ను లాక్‌ చేసినట్టుగానే దీన్ని పనిచేయకుండా చేయవచ్చు. త్వరలోనే ఈ ప్లాస్టిక్‌ పట్టీ ద్వారా మరిన్ని ఎక్కువ సేవలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇనామో అంటోంది. మరో నెలలో అందుబాటులోకి రానున్న ఈ హైటెక్‌ గాడ్జెట్‌ ఖరీదు 20 ఆస్ట్రేలియన్‌ డాలర్లు (వెయ్యి రూపాయలు). నెలవారీ ఫీజులు అదనం.
మరిన్ని వార్తలు