ముషార్రఫ్‌పై హత్యాభియోగం

21 Aug, 2013 01:03 IST|Sakshi
ముషార్రఫ్‌పై హత్యాభియోగం

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌పై మంగళవారమిక్కడి ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఒకటి హత్యా నేర అభియోగాలను నమోదు చేసింది. 2007లో జరిగిన మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో ఈ చర్య తీసుకుంది. 66 ఏళ్ల దేశ చరిత్రలో అత్యధిక కాలం సైన్యమే పాలించిన పాక్‌లో ఓ మాజీ సైనిక పాలకుడిపై అభియోగాలను నమోదు చేయడం ఇదే తొలిసారి.

 

భుట్టో హత్యకు యత్నించడం, హత్యకు కుట్ర చేయడం, హత్యకు అవసరమైనవి సమకూర్చడం వంటి అభియోగాలు వీటిలో ఉన్నాయి. ఈ కేసులో ముషార్రఫ్‌తో పాటు ఏడుగురు నిందితులున్నారు. నేరం రుజువైతే ముషార్రఫ్‌కు మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది.

మరిన్ని వార్తలు