అధ్యక్షుని బర్త్‌డే.. దేశానికి హాలిడే

19 Aug, 2017 20:10 IST|Sakshi
అధ్యక్షుని బర్త్‌డే.. దేశానికి హాలిడే

హరారే: జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే పుట్టినరోజు వచ్చే ఫిబ్రవరి 21వ తేదీన దేశమంతటీ సెలవుగా ప్రకటించేశారు. ఈ రోజును నేషనల్‌ యూత్‌ డే అని నిర్ణయించారు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం కావాలని అధికార ప్రతిక తెలిపింది. దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టుకు ఆయన పేరు పెట్టాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది.

ఒక మిలియన్‌ డాలర్ల ఖర్చుతో రాబర్ట్‌ ముగాబే యూనివర్సిటీ నిర్మాణానికి ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. 1980వ సంవత్సరంలో ఈ దేశానికి బ్రిటన్‌ నుంచి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి అధికార పీఠంపై కూర్చున్న ఆయన అప్రతిహతంగా అధ్యక్షపదవిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 93 ఏళ్లు. వృద్ధాప్యం కారణంగా ఆరోగ్యం సహకరించనప్పటికీ వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ   పోటీ చేయనున్నట్లు ముగాబే ప్రకటించారు.

దేశం 200వ సంవత్సరం నుంచి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది.ప్రభుత్వ ఆదాయంలో 90 శాతం ఉద్యోగుల వేతనాల చెల్లింపులకే సరిపోతోంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షాలన్నీ ఐక్యమై మూకుమ్మడిగా ఒకే అభ్యర్థిని బరిలోకి దించాలని యోచిస్తున్నాయి. ప్రతిపక్షాలను అణగదొక్కి ఆయన పాలన సాగిస్తున్నారని, దేశం ఆర్థిక వెనుకబాటుకు ఆయనే కారణమని ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తలు