కిలాడీ కోకిల

28 Mar, 2017 21:16 IST|Sakshi
కిలాడీ కోకిల

► పర్సుల చోరీలో నిష్ణాతురాలు

బనశంకరి : బీఎంటీసీ బస్సులో ఓ ప్రయాణికుడి పర్సు తస్కరిస్తూ ప్రయాణికుల చేతికి చిక్కిన ఓ కిలాడి లేడిని చితకబాదారు. ఈ సంఘట బనశంకరి హెచ్‌ఏఎల్‌పోలీస్‌స్టేషన్‌ పరిథిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు... తమిళనాడుకు చెందిన కోకిలాపై 11 పోలీస్‌ స్టేసన్లలో చోరీ కేసులున్నాయి. కోకిలా అనే కిలాడీలేడీ పై నగరంలో 11 పోలీస్‌స్టేషన్లులో చోరీకేసులు ఈమె పై నమోదయ్యాయి. గత 10 ఏళ్లుగా చోరీలనే ప్రవృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్న కోకిలా పై వందలాదికేసులు ఉన్నాయి.

చంటిబిడ్డను ఎత్తుకుని అమాయక మహిళగా బస్సు ఎక్కుతూ ప్రయాణికుల జేబుల్లో పర్సులు, మహిళమెడల్లో బంగారు ఆభరణాలు అపహరించి క్షణాల్లో ఉడాయించేది. మంగళవారం ఉదయం బీఎంటీసీ బస్సులో ప్రయాణికుల పర్సు కోకిలా దొంగలిస్తుండగా ప్రయాణికులు పట్టుకుని చితకబాది హెచ్‌ఏఎల్‌ పోలీసులకు అప్పగించారు. ఈమె పై హెచ్‌ఏఎల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తాన్నారు. నగరంలో ప్రయాణికుల రధ్దీ అధికంగా ఉన్న బీఎంటీసీ, కేఎస్‌ఆర్‌టీసీ బస్సులు ఎక్కే ప్రయాణికుల పర్సులు, బంగారు ఆభరణాలు చాకచక్యంగా తస్కరించేంది. అలాగే మాల్స్‌లోకి చొరబడి అక్కడ కూడా తన చేతివాటం చూపించేంది.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు