త్వరితంగా నిర్మాణం

3 Aug, 2015 01:21 IST|Sakshi
త్వరితంగా నిర్మాణం

రాజధాని కోసం కార్యాచరణ
{పణాళిక రూపొందించాలి
సలహా కమిటీ సభ్యుల నిర్ణయం
కార్యాలయాల తరలింపు వేగిరపరచాలన్న మంత్రి

 
హైదరాబాద్: నూతన రాజధాని నిర్మాణాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేసేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొం దించాలని రాజధాని నగర సల హా కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సింగపూర్ నుంచి సీడ్ కేపిటల్ ప్రణాళిక అందినందున ఇక త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఆదివారం సచివాలయంలో పురపాలకశాఖ మంత్రి డా. పి.నారాయణ అధ్యక్షతన సలహా కమిటీ సభ్యులు బీద మస్తాన్‌రావు, జీఎంఆర్ గ్రూప్ ప్రతినిధి బొమ్మిడాల శ్రీనివాస్, నూజివీడు సీడ్స్ అధినేత ఎం.ప్రభాకరరావు, పీపుల్స్ కేపిటల్ ప్రతిని ధి సీహెచ్ శ్రీనివాసరాజు తదితరులతో సమావేశమయ్యారు. సింగపూర్ ప్రతినిధులు మాస్టర్ ప్లాన్ అందించిన తర్వాత తొలిసారి కమిటీ సభ్యులు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో రాజధాని నిర్మాణంతో పాటు భూములిచ్చిన రైతుల అంశాలు ప్రస్తావించారు. రాజధానికోసం విజయవాడ, గుం టూరు పరిధిలో భూములిచ్చిన రైతులకు వీలైనంత త్వరలో లే ఔట్లు వేసి, అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలని నిర్ణయించారు.  సమావేశంలో సలహా సంఘం కమిటీ సభ్యులతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డా. పీవీ రమేశ్, సీఆర్‌డీఏ కమిషనర్ ఎస్.శ్రీకాంత్, పురపాలక శాఖ తాత్కాలిక ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యాలయాలను వీలైనంత త్వరలో కొత్త రాజధాని పరిధిలోకి తరలించాలని నిర్ణయించారు. సచివాలయంలో మంత్రి నారాయణ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు