రంగంలోకి దిగిన ఆర్బీఐ

12 Dec, 2016 15:06 IST|Sakshi
రంగంలోకి దిగిన ఆర్బీఐ

ముంబై: డాలర్ తో  పోలిస్తే రూపాయి విలువ భారీ పతనంపై కేంద్ర బ్యాంక్ రంగంలోకి  దిగింది. డాలర్ మారకపు విలువలో రోజు రోజుకు క్షీణిస్తున్న దేశీయ కరెన్సీని ఆదుకునేందుకు  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది.   గురువారం ఉదయం సుమారు రూ.68.80  మార్కుకు పడిపోయిన  రూపాయికి మద్దతిచ్చేందుకు  భారీ ఎత్తున డాలర్  అమ్మకాలు చేసింది. దీంతో కనిష్ట స్థాయిలనుంచి  కోలుకుంది. 68.80 స్థాయినుంచి రీబౌండ్  అయ్యి 11 పైసల నష్టంతో రూ.68.67 వద్ద ట్రేడవుతోంది.

సుమారు  500 మిలియన్ డాలర్లను ఆర్బీఐ  విక్రయించిందని ట్రేడర్లు తెలిపారు. ఆర్ బీఐ జోక్యంతో రికార్డు స్థాయిని కనిష్టానికి పడిపోయిన రూపాయి కోలుకుందని  చెప్పారు.
 కాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయంతో యూఎస్ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడం, వడ్డీ రేట్ల పెంపు అంచనాలు వంటివి డాలర్‌ను 13 ఏళ్ల గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. అంతర్జాతీయ కరెన్సీలు డాలర్‌తో పోలిస్తే మరింత బలహీనతను నమోదుచేస్తున్నాయి.  మరోవైపుదేశీయ మార్కెట్లు, బంగారం, వెండి ధరలుకూడానేల చూపులు  చూస్తున్నసంగతి తెలిసిందే.  .
 

మరిన్ని వార్తలు