ఆన్‌లైన్‌ కోర్సులకు 100 కోట్ల స్కాలర్‌షిప్పులు

24 Apr, 2017 08:30 IST|Sakshi

ముంబై: ఆన్‌లైన్‌లో కోర్సులు అభ్యసించే వారి కోసం రూ.100 కోట్ల ఉపకార వేతనాలను అందించనున్నట్లు ఆన్‌లైన్‌ విద్యాసంస్థ అప్‌గ్రాడ్‌ సహ వ్యవస్థాకుడు రోనీ స్క్రూవాలా ప్రకటించారు. కనిష్టంగా రూ. 25,000 నుంచి గరిష్టంగా 2 లక్షల వరకు స్కాలర్‌షిప్స్‌ను అందిస్తామని  తెలిపారు. 

మన దేశానికి ప్రస్తుతం 12.5 కోట్ల పోస్ట్‌ గ్రాడ్యుయేట్ల అవసరం ఉందనీ, కాని మూడు కోట్ల మంది మాత్రమే అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు. ఇలాంటి వారికి ఆన్‌లైన్‌ కోర్సులే సరైన పరిష్కారమని స్క్రూవాలా తెలిపారు. రూ.100 కోట్ల కనీస మూలధనంతో ప్రారంభమైన ఈ స్కాలర్‌షిప్స్‌ మొత్తాన్ని వచ్చే 3,4 ఏళ్లలో రూ.400 కోట్లకు పెంచనున్నట్లు ప్రకటించారు. ఈ నిధికి తనవంతుగా రూ.10 కోట్లు అందిస్తున్నట్లు స్క్రూవాలా తెలిపారు.   
 

మరిన్ని వార్తలు