కళ్లెదుటె రెండున్నర కోట్లు బూడిద పాలు

24 Aug, 2015 15:00 IST|Sakshi
కళ్లెదుటె రెండున్నర కోట్లు బూడిద పాలు

న్యూఢిల్లీ: ఆ కారులో కూర్చుంటే రాకెట్లో కూర్చున్నంత ఫీలింగ్. చూడగానే హత్తుకున్నామంత థ్రిల్లింగ్. వాయువేగంగా సాగే డ్రైవింగ్.. ఇది ఇటలీ కంపెనీకి చెందిన లాంబోర్గిని గల్లార్డో అనే కారును చూస్తే వచ్చి అనుభూతి. ఇంతకీ ఈ కారు ధరంతే తెలుసా అక్షరాల రెండున్నర కోట్లు. అలాంటి కారు దక్షిణ ఢిల్లీలో మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. దీంతో రెండున్నర కోట్ల రూపాయలు బూడిదపాలు చేసినట్లయింది. దక్షిణ ఢిల్లీలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇటలీ కంపెనీకి చెందిన లాంబోర్గిని గల్లార్డో అనే కారును దాని యజమాని రూ.2.5 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. దీనికి 5.2 లీటర్ల ఇంధన పరిమాణంతో ఇంజిన్ ఉంటుంది. ఈ కారు డ్రైవర్ సోమవారం ఉదయం దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని బదర్పూర్ నుంచి వస్తుండగా అనూహ్యంగా అందులో మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అతడు అందులో నుంచి ఎలాంటి గాయాలవకుండా సురక్షితంగా బయటపడ్డాడు. కారు వెనుక భాగం నుంచి మధ్యభాగం వరకు పూర్తిగా కాలిపోయింది. ఫైరింగ్ సిబ్బంది వచ్చి దాని మంటలు ఆర్పేయగా సగం కారు మాత్రమే మిగిలింది. ఈ కంపెనీ కారు వేగం దాదాపు గంటలకు 350 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. 2013లో బయటకు వచ్చిన ఈకార్లు పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి.
 

మరిన్ని వార్తలు