విమానంలో శాంసంగ్ టాబ్లెట్ పొగలు

27 Sep, 2016 17:37 IST|Sakshi
ఇప్పటికే గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుళ్ల ఘటనతో తీవ్ర సతమతమైన శాంసంగ్కు మరో చిక్కు వచ్చి పడింది. మరోసారి మరో విమానంలో ఈ ఫోన్ పేలిందని తెలిసింది. ఆ పేలుడు ఘటనతో డెట్రాయిట్ నుంచి అమ్స్టెర్డామ్ వెళ్లే డెల్టా విమానాన్ని  శనివారం ఇంగ్లాండ్లోని మాంచెస్టర్కు మళ్లించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మాంచెస్టర్కు వెళ్తున్న ఈ విమానంలో శాంసంగ్ పాబ్లెట్ సీటు లోపలికి పడిపోయి, దానిలో ఇరుక్కు పోయింది. అనంతరం ఆ టాబ్లెట్ పేలి సీటు కవర్ నుంచి పొగలు రావడం ప్రారంభమైంది.
 
ఆ వింత వాసన, పొగలను గమనించిన ప్రయాణికులు డెల్టా అధికారులకు వెంటనే సమాచారాన్ని అందజేశారు. దీంతో ఆ విమానాన్ని మాంచెస్టర్కు మరలించారు. శాంసంగ్ టాబ్లెట్ వల్ల పాడైపోయిన సీటును కొత్త దానితో పునరుద్ధరించారు. రెండు గంటల అనంతరం మళ్లీ డెల్టా విమానం అమ్స్టెర్డామ్కు పయనమైంది. 
 
అయితే ఈ ఘటనను శాంసంగ్ ఖండిస్తోంది. బహిరంగ కారణాలే ఈ ఘటనకు దోహదం చేసి ఉంటాయని, గెలాక్సీ నోట్7 వల్ల ఈ పొగలు వ్యాపించలేదని శాంసంగ్ ఓ ప్రకటనలో తెలిపింది. సమస్యాత్మకమైన బ్యాటరీగల ఫోన్లను తాము రీకాల్ చేస్తున్నామని, ఈ ఘటన శాంసంగ్ ఫోన్ వల్ల కాకపోవచ్చని స్పష్టంచేస్తోంది.డెల్టా అధికారులను తాము ఆశ్రయిస్తామని, దీనిపై విచారిస్తామని పేర్కొంటోంది. మరోవైపు ఈ ఘటనను ఎఫ్ఏఏ సమీక్షిస్తోంది.   
 
మరిన్ని వార్తలు