శంకర్ రామన్ హత్య కేసులో కంచి పీఠాధిపతులకు ఊరట

27 Nov, 2013 11:47 IST|Sakshi
శంకర్ రామన్ హత్య కేసులో కంచి పీఠాధిపతులకు ఊరట

చెన్నై : కాంచీపురంలోని వరదారాజ పెరుమాళ్ ఆలయం మేనేజర్ శంకర్రామన్ హత్య కేసులో కంచి కామకోటి పీఠాధిపతులకు ఊరట లభించింది. జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి నిర్దోషులని పుదుచ్చేరి జిల్లా కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో స్వాముల ప్రమేయంపై దర్యాప్తు బృందం ఆధారాలు చూపలేకపోయారని  కోర్టు అభిప్రాయపడింది. స్వాములతో పాటు మిగిలిన నిందితులపైనా అభియోగాలు నిరూపించడంలో దర్యాప్తు బృందం విఫలమవడంతో అందరినీ నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది.

 2004లో సెప్టెంబర్3న కాంచీపురంలోని వరదాజ పెరుమాళ్ ఆలయం మేనేజర్ శంకర్రామన్ ఆలయ ప్రాంగణంలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. దాంతో ఆ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆ హత్యలో కంచి పీఠాధిపతులు పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కంచి పీఠాధిపతులు జయేంద్ర, విజయేంద్ర సరస్వతులతోపాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద నిందితులుగా కేసులు నమోదుయ్యాయి. ఈ కేసుకు సంబంధించి పుదుచ్చేరి కోర్టు 9 సంవత్సరాల పాటు 189 మంది సాక్షులను విచారించింది.
 

మరిన్ని వార్తలు