వాట్సాప్‌కు మరో ఎదురుదెబ్బ

5 Apr, 2017 14:14 IST|Sakshi
వాట్సాప్‌కు మరో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: ప్రైవసీ నిబంధనల ఉల్లంఘనపై ఇటీవల విమర్శల పాలవుతున్న వాట్సాప్, ఫేస్‌బుక్ లకు సుప్రీంకోర్టులో  మరోసారి ఎదురు దెబ్బ తగిలింది.  వాట్సాప్‌ ప్రైవసీ పాలసీని సుప్రీం వ్యతిరేకించింది. వీటిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.   ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన  రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అనంతరం  తదుపరి విచారణను ఏప్రిల్‌ 18కి వాయిదా వేసింది.  చీఫ్‌జస్టిస్ జేఎస్ ఖెహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం  ఈ ఆదేశాలు  జారీ చేసింది.

వినియోగదారుల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేలా వాట్సాప్, ఫేస్‌బుక్ నిబంధనలు రూపొందించుకోవడంపై  సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే తీవ్రంగా  తప్పుబట్టారు. సోషల్ మీడియాలో సమాచార భద్రత లేకపోవడంతో వినియోగదారుల ప్రైవసీకి నష్టమంటూ  సుప్రీంను ఆశ్రయించారు.  ఈ వ్యవహారంలో ఈ ఏడాది జనవరిలో  వాట్సాప్, ఫేస్‌బుక్, కేంద్ర ప్రభుత్వం, ట్రాయ్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కాగా  సోషల్ నెట్‌వర్కింట్ సైట్లువాట్సాప్, ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా దేశంలోని 15.7 కోట్ల మందికిపైగాఉన్న యూజర్ల ప్రైవసీని దెబ్బతీస్తున్నాయని, ఇది హక్కుల ఉల్లంఘన అని  విమర్శలు చెలరేగాయి.  ముఖ్యంగా వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తర్వాత వాట్సాప్ వినియోగదారుల డాటాను ఫేస్‌బుక్‌తో షేరింగ్ చేసుకునేలా ప్రైవసీ పాలసీలో మార్పులు చేసింది.  దీనిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్నసంగతి  తెలిసిందే.

 

మరిన్ని వార్తలు