గాల్లో చక్కర్లు కొట్టిన బైక్‌ !

24 Aug, 2017 17:07 IST|Sakshi
గాల్లో చక్కర్లు కొట్టిన బైక్‌ !

జియాంగ్సు: అతి వేగం ప్రమాదానికి కారణం. స్కూటర్‌ గాల్లో చక్కర్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బైక్‌ నడుపుతున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరు కిందపడిపోవటం ఈ వీడియోలో కనిపిస్తోంది. కానీ అదృష్టవశాత్తూ ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు.

ఆగస్టు 19వ తేదీన చైనాలోని జియాంగ్సు రాష్ట్రంలోని టైజాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తి  యూ టర్న్‌ అవుతున్న కారును తప్పించడానికి పోవడంతో ఈ ప్రమాదం జరిగింది.  వేగం కంట్రోల్‌  కాకపోవడంతో 360 డిగ్రీలు గాల్లో తిరిగి కిందపడిపోయింది. బైక్‌పైన ఇద్దరు పెద్దలతోపాటు ఒక పిల్లవాడు ఉన్నాడు. రోడ్డుపైన పడిపోయిన వాళ్లని ఎవరూ పట్టించుకోలేదు. ఈ వీడియోను చైనాలోని ఒక మీడియా ఫెస్‌బుక్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాల్‌ హల్‌చల్‌ చేస్తోంది.