'రాష్ట్రంలో నేరగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారు'

17 Feb, 2015 11:15 IST|Sakshi
'రాష్ట్రంలో నేరగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారు'

ముంబై: మహారాష్ట్రలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించాయని శివసేన ఆరోపించింది. సీపీఐ పార్టీ సీనియర్ నేత గోవింద్ పన్సారేపై కాల్పుల ఘటనను ఆ శివసేన ఖండించింది. పట్టపగలు చోటు చేసుకున్న ఈ ఘటనకు ఎవరు బాధ్యలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో నేరగాళ్లు, ఖూనీ కోరులు బోర విడిచి తిరుగుతున్నారని ఆరోపించింది. అలాంటి వారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తుందని విమర్శించింది.

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన  ప్రముఖుడు నరేంద్ర దబోల్కర్ దారుణ హత్యకు గురయ్యారని గుర్తు చేసింది. నాటికి నేటికి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏ మాత్రం మారలేదని శివసేన ఆందోళన వ్యక్తం చేసింది. సాంఘిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజ హితానికి చేస్తున్న కృషిని శివసేన ఈ సందర్భంగా అభినందనీయమని శివసేన పేర్కొంది. మంగళవారం శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో ఈ మేరకు పేర్కొంది.

మహారాష్ర్టలో టోల్ చార్జీల వసూళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపించిన సీపీఐ సీనియర్ నేత గోవింద్ పన్సారే దంపతులపై సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో పన్సారే తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. భార్య సౌమ పన్సారే శరీరంలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. మోటార్ సైకిల్ వచ్చిన దుండగులు ఆయన నివాసం సమీపంలో ఈ ఘటనకు పాల్పడ్డారు. శివాజీ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మార్నింగ్ వాక్కు వెళ్లి వస్తుండగా ఆగంతుకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ దుండగుల చర్యను తీవ్రంగా ఖండించారు.అయితే పన్సారే చత్రపతి శివాజీపై ఓ బుక్లెట్ను ప్రచురించారు. అది వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు