నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు

17 Oct, 2016 16:21 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో  ముగిశాయి.   ఆరంభంలో  లాభాలతో మురిపించిన  స్టాక్‌ మార్కెట్లు చివరికి  నష్టాల్లోకి జారుకున్నాయి.  యూరప్‌ మార్కెట్లు నష్టాలతో  ప్రారంభం కావడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి.  చివరికి  సెన్సెక్స్‌ 144 పాయింట్లు క్షీణించి 27,530 వద్ద,  నిఫ్టీ  63 పాయింట్లనష్టంతో  8,520 వద్ద ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌  రంగం స్పల్పంగా లాభపడగా  ఆటో క్యాపిటల్ గూడ్స్  షేర్ల నష్టాలు మార్కెట్ ను ప్రభావితం చేశాయి.  ఫార్మా, ఐటీ నష్టాల్లో ముగిశాయి. జీ  ఎంటర్ టైన్ మెంట్ టాప్ లూజర్ గా నిలవగా ఐడియా, బాష్‌, అంబుజా సిమెంట్‌, ఎంఅండ్‌ఎం, ఐషర్‌ మోటార్స్, టెక్‌ మహీంద్రా, గ్రాసిమ్‌, ఏసీసీ, హీరో మోటో   క్షీణించాయి.  ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌, ఓఎన్‌జీసీ, టీసీఎస్‌, ఎస్‌బీఐ, ఐటీసీ లాభపడ్డాయి.  కాగా మార్కెట్లో మరింత కరెక్షన్ కు అవకాశం ఉందని ఎనలిస్టులు తెలిపారు.
అటు డాలర్  మారకపు విలువలో రూపాయి 11 పైసల నష్టంతో 66.82 వద్ద ఉంది. ఫెడ్ వడ్డీరేట్లు పెంపు అంచనాలతోడాలర్  విలువ  బాగా పుంజుకోవడం రూపాయిని దెబ్బతీసింది.  భవిష్యత్తులోమరింత క్షీణించే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.   ఎంసీఎక్స్ మార్కెట్ లోపుత్తడి 10 గ్రా. 13  రూపాయల నష్టంతో 29,643 వద్ద ఉంది.  
 

మరిన్ని వార్తలు