స్వల్ప లాభాల్లో స్టాక్మార్కెట్లు

14 Sep, 2016 10:02 IST|Sakshi
ముంబై : వరుసగా ముందు రెండు సెషన్లలో నష్టాలు పాలైన స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్లో స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. 10 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ 33.31 పాయింట్ల లాభంలో 28,320 గా నమోదవుతోంది. నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో 8706 వద్ద ట్రేడ్ అవుతోంది. మెటల్, ఎఫ్ఎమ్సీజీ సూచీలు మినహా మిగతా మేజర్ రంగ సూచీలన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఏఫ్రిల్-జూన్ త్రైమాసికంలో అంచనావేసిన దానికంటే తక్కువ ఆదాయాలను ఆర్జించడంతో, ఈ కంపెనీ షేర్లు 2 శాతానికి పైగా పతనమవుతున్నాయి. టాటా స్టీల్ కూడా క్యూ1 ఫలితాలతో ఆ కంపెనీ షేర్లు 1.61 శాతం పడిపోతున్నాయి.
 
అదేవిధంగా అదానీ పోర్ట్స్, ఐటీసీ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, జీ ఎంటర్టైన్మెంట్, భారతీ ఇన్ఫ్రాటెల్ నష్టాలను గడిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, సన్ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, హిందాల్కో, బీపీసీఎల్, యస్ బ్యాంకులు లాభాలను ఆర్జిస్తున్నాయి. సోమవారం అమ్మకాల ఒత్తిడితో సతమతమైన పబ్లిక్ రంగ బ్యాంకులు నేటి ట్రేడింగ్లో రికవరీ అయ్యాయి. నిఫ్టీ పీఎస్యూ, ఎన్ఎస్ఈ సబ్ ఇండెక్స్ 1.6 శాతం మేర పెరిగింది. 2.1 శాతం లాభంతో బ్యాంకు ఆఫ్ బరోడా నిఫ్టీ టాప్ గెయినర్గా కొనసాగుతోంది. మరోవైపు వాల్ స్ట్రీట్ నుంచి వస్తున్న నెగిటివ్ సంకేతాలతో ఆసియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 
అటు డాలర్తో రూపాయి మారకం విలువ రెండు వారాల కనిష్ట స్థాయిలో ప్రారంభమైంది. ముందటి సెషన్ ముగింపుకు 7 పైసలు పడిపోయిన రూపాయి, డాలర్కు 66.99గా ఉంది. 
 
మరిన్ని వార్తలు