ఐసీసీ చైర్మన్‌ శశాంక్‌ రాజీనామా

15 Mar, 2017 14:46 IST|Sakshi
ఐసీసీ చైర్మన్‌ శశాంక్‌ రాజీనామా

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌ పదవి నుంచి శశాంక్‌ మనోహర్‌ అనూహ్యరీతిలో తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన బుధవారం ప్రకటించారు. భారత క్రికెట్‌ సంఘం (బీసీసీఐ) గతకొంతకాలంగా శశాంక్‌ తీరుపై గుర్రుగా ఉందని సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఐసీసీ చైర్మన్‌గిరీ నుంచి శశాంక్‌ అర్ధంతరంగా తప్పుకున్నారని అంటున్నారు. గతంలో రెండుసార్లు బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించిన ఆయన.. 2016 మేలో ఐసీసీ చైర్మన్‌ పదవి చేపట్టారు. ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికై.. ఈ పదవి చేపట్టిన తొలి ఇండిపెండెంట్‌ చైర్మన్‌గా నిలిచారు. రెండేళ్లు ఆయన పదవీకాలం  కాగా, వ్యక్తిగత కారణాలను చూపిస్తూ ఆయన అర్ధంతరంగా తప్పుకున్నారు.

మరిన్ని వార్తలు