రెస్టారెంట్స్, హోటల్స్ మూసివేయండి!

11 Feb, 2017 15:09 IST|Sakshi
రెస్టారెంట్స్, హోటల్స్ మూసివేయండి!
రోడ్డు పక్కకు ఏమైనా షాపులు, రెస్టారెంట్లు, హోటల్స్ కట్టాలంటే.. ముందస్తుగా దానికి అనువైన పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. లేకపోతే రోడ్లపై వెళ్లే వాహనాదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పవు. కానీ కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ మాత్రం అసలు పార్కింగ్ స్థలాలను  ఏర్పాటుచేయవు.  ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న మద్రాసు హైకోర్టు, సరిపడ పార్కింగ్ ప్రాంత లేని రెస్టారెంట్లు, హోటల్స్ను మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది.  చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎం సుందర్లతో కూడా బెంచ్ ఈ మేరకు శుక్రవారం తీర్పునిచ్చింది.
 
పార్కింగ్ స్థలం లేని రెస్టారెంట్లకు, హోటల్స్కు లైసెన్సులు రద్దు చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారించిన బెంచ్ సభ్యులు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. ఈ విషయంపై తదుపరి విచారణ మార్చి 24న చేపడతామని చెప్పారు. విచారణ తేదీలకు మూడు రోజుల ముందు వరకు ఈ విషయంపై జాయింట్ ప్రొగ్రెస్ రిపోర్టును తమకు అందజేయాలని అథారిటీలను ఆదేశించారు. '' ఒకవేళ సరిపడ పార్కింగ్ స్థలం లేకుండా రెస్టారెంట్లు, హోటల్స్ నడుస్తుంటే వాటిని వెంటనే అథారిటీలు మూసివేయాలి'' అని  బెంచ్ సభ్యులు పేర్కొన్నారు. 
 
మరిన్ని వార్తలు