లంక కకావికలం

29 May, 2017 11:04 IST|Sakshi
లంక కకావికలం

- ‘నైరుతి’ కుంభవృష్టి.. 150 మంది మృత్యువాత
- 200 మంది గల్లంతు.. నిరాశ్రయులైన 4 లక్షల మంది..
- సహాయానికి తరలివెళ్లిన భారత బృందాలు


కొలంబో:
ద్వీపదేశం శ్రీకలను భారీ వర్షాలు కకావికలం చేశాయి. గడిచిన 14 ఎళ్లలో కనీవినీఎరగని స్థాయిలో వరద ముంచెత్తడంతో భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభివించింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదల్లో కొట్టకుపోయి, మట్టిపెళ్లలు విరిగిపడి సుమారు 150 మంది ప్రాణాలుకోల్పోగా, 200 మంది గల్లంతయ్యారు. మరో 90 మంది తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్నారు. దాదాపు 4 లక్షల మంది ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

నైరుతి రుతుపవనాల కారణంగా గడిచిన వారం రోజులుగా శ్రీలంకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టితో వాగులు, నదులు పొంగిపొర్లాయి. మట్టిచరియలు విరిగిపడటంతో జనసముదాయాలను బురద చుట్టుముట్టింది. వందల సంఖ్యలో వాహనాలు, ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. అత్యయిక పరిస్థితిని ప్రకటించిన శ్రీలంక ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. దాదాపు 2 వేల మంది సైనికులు.. ప్రజలను తరలించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. శ్రీలంక అభ్యర్థన మేరకు భారత్ ఐక్యరాజ్యసమితి బృందాలు సహాయకార్యక్రమాల్లో పాల్గొనేందుకు తరలివెళ్లాయి.


భారత నౌకాదళానికి చెందిన ‘శార్దూల్‌’ నౌక ద్వారా మెడికల్‌ కిట్లు, వైద్యసిబ్బందిని చేరవేశారు. అటు పాకిస్థాన్‌ కూడా లంకకు ఆపన్నహస్తం అందించింది. ఇటీవలే శ్రీలంకకు 10వేల టన్నుల బియ్యాన్ని అందించిన పాక్‌.. వరదల నేపథ్యంలో మరికొన్ని టన్నులు సరఫరా చేయనున్నట్లు తెలిపింది.








మరిన్ని వార్తలు