స్టార్ నటుల యాంకరింగ్పై దుమారం

19 Aug, 2014 20:22 IST|Sakshi
యాంకరింగ్ చేస్తున్న సుదీప్

బెంగళూరు: స్టార్ నటులు టీవీ యాంకరింగ్ చేయడంపై కన్నడ సినీమా రంగంలో పెద్ద దుమారం లేచింది. అన్ని భాషల హీరోలు, హీరోయిన్లు ఇటీవల టీవీ యాంకర్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. శాండల్‌వుడ్ స్టార్‌లుగా వెలుగొందుతున్న వారు యాంకర్‌లుగా మారుతుండడంపై కన్నడ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 స్టార్ యాంకర్‌ల కార్యక్రమాలు వారాంతాల్లో ప్రసారం అవుతుండడంతో థియేటర్లకు రావాల్సిన అభిమానులు టీవీ చూడ్డానికే పరిమితమవుతున్నారని నిర్మాతలు చెబుతున్నారు.  యాంకర్‌లుగా వ్యవహరిస్తున్న స్టార్ నటులను సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలని  నిర్మాతల సంఘం  కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలికి ఫిర్యాదు చేసింది.

మరిన్ని వార్తలు