ఏసీబీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

3 Jul, 2015 14:32 IST|Sakshi
ఏసీబీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

రేవంత్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుల నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారని, సీఆర్పీసీ సెక్షన్ 164 కింద కేసు విచారణ పూర్తి చేశారని కోర్టు భావించింది. ఇప్పుడు మళ్లీ కస్టడీకి తీసుకుని ఏం విచారిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రధాన నిందితుడు కేసును ప్రభావితం చేస్తాడని ఏసీబీ వాదించినా, ఆ వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ మీద జోక్యం చేసుకోడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. (చదవండి- రేవంత్ బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ ప్రారంభం)

ఏసీబీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో పలు లోపాలు ఉన్నాయని సిబల్ అన్నారు. కానీ, ఆయన వాదనతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. భోస్లే ఏకీభవించలేదు. ఇప్పటికే నెల రోజుల పాటు రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నారని అన్నారు. విచారణ పూర్తయినందున ఇక ఆయన బెయిల్ రద్దుచేయాల్సిన అవసరం లేదని భావించారు. కాగా, బెయిల్ షరతులను రేవంత్ ఉల్లంఘించారని, జైలు నుంచి విడుదలైన సమయంలోనే బెదిరింపు ధోరణిలో ముఖ్యమంత్రిపై మాట్లాడారని న్యాయవాదులు అంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని, మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది.

మరిన్ని వార్తలు