మహిళ జర్నలిస్ట్ నుంచి స్టేట్మెంట్ రికార్డు

26 Nov, 2013 14:32 IST|Sakshi
మహిళ జర్నలిస్ట్ నుంచి స్టేట్మెంట్ రికార్డు

న్యూఢిల్లీ : లైంగిక వేధింపులకు గురైన మహిళా జర్నలిస్టు నుంచి గోవా పోలీసులు స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. మరోవైపు , కేసు విచారణకు సంబంధించి తెహల్కా యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ ఉద్యోగుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా అసోసియేట్ ఎడిటర్ రాణా కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇక సంస్థ కన్సల్టింగ్ ఎడిటర్ మజూందార్, అసిస్టెంట్ ఎడిటర్ రేవతి లాల్‌లు కూడా రాజీనామాలు సమర్పించినట్టు తెలిసింది. తెహల్కా లిటరరీ ఎడిటర్ షౌగత్ దాస్‌గుప్తా కూడా అదే బాటలో ఉన్నట్టు సమాచారం. కాగా లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో తెహల్కా యాజమాన్యం అంతర్గత విచారణ కమిటీని నియమించింది.

అయితే పోలీసుల తీరుపై తేజ్‌పాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే సిసి ఫుటేజ్‌ను పోలీసులు చూడటం లేదని ఆయన ఆరోపించారు. గోవా పోలీసుల విచారణపై తరుణ్ తేజ్పాల్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు తేజ్‌పాల్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.

లైంగికదాడి బాధితురాలు, తెహల్కా మహిళా జర్నలిస్టు తన ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఒత్తిడి నుంచి దూరంగా ఉండేందుకే తానీ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె ఓ వార్తాసంస్థకు తెలిపారు. బాధితురాలు తన రాజీనామాను రెండు రోజుల కిందటే కార్యాలయానికి పంపినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు