మిస్త్రీకి షాక్ ఇచ్చిన భాస్కర్ భట్

11 Nov, 2016 13:31 IST|Sakshi
మిస్త్రీకి షాక్ ఇచ్చిన భాస్కర్ భట్

ముంబై: టాటా  సన్స్‌ ఛైర్మన్ గా సైరస్ మిస్త్రీ  ఉద్వాసన సెగలు  ఇంకా రగులుతూనే ఉన్నాయి. తాజాగా మిస్త్రీ విశ్వాసఘాతుకానికి  పాల్పడ్డాడని టాటా గ్రూపు ఆరోపిస్తుండగా, టాటా కెమికల్స్ లిమిటెడ్  నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ భాస్కర్ భట్ రాజీనామా చేశారు.  ఈ మేరకు భట్ బోర్డ్ ఛైర్మన్  సైరస్ మిస్త్రీకి ఒక లేఖ రాశారు. అలాగే ఆయన రాజీనామాను తక్షణమే అమల్లోకి వస్తుందని  టాటా కెమికల్స్ మార్కెట్ రెగ్యులేటరీకి అందించిన సమాచారంలో  పేర్కొంది. అయితే  భాస్కర్ భట్ రాజీనామా చేయడం వ్యక్తిగత వ్యవహారమనీ కంపెనీపై ఆయన రాజీనామా ప్రభావం చూపబోదని టాటా కెమికల్స్ తేల్చి చెప్పింది.

బీఎస్ఈ వెబ్సైట్ లో సమాచారం చూసిన తరువాత ఈ  నిర్ణయం భట్ తీసుకుంటున్నట్టు తెలిపారు. మిస్త్రీని ఛైర్మన్ గా కొనసాగించాలన్న టాటా కెమికల్స్ స్వతంత్ర డైరెక్టర్ల నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నాన్నారు. ఎంపిక చేసిన గణాంకాలను మాత్రమే ఉటంకించారని తను వ్యక్తం చేసిన అభిప్రాయాలు భిన్నంగా ఆ ప్రకటన ఉండడంతో తక్షణమే రాజీనామా చేయాలన్న ఆలోచనకు వచ్చినట్టు పేర్కొన్నారు.  ఇన్నాళ్ల తనపదవీ కాలాన్ని ఎంజాయ్ చేసానన్న భట్ తన పట్ల మిస్త్రీ చూపించిన గౌరవానికి ధన్యవాదాలు తెలిపుతున్నాన్నారు.

మరోవైపు భట్ రాజీనామా, టాటా కెమికల్స్ త్రైమాసిక ఫలితా  నేపథ్యంలో టాటా  కెమికల్స్‌ పేరు 3 శాతానికిపైగా పడిపోయింది. మొత్తం ఆదాయం రూ 4,213 కోట్ల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ 3,496.27 కోట్లకు పడిపోయినట్లు   సంస్థ ప్రకటించింది.  నికర లాభాల్లో స్వల్పంగా పెరిగా  రూ 293 కోట్లు తెలిపింది.  ఫెర్టిలైజర్ విభాగం నుంచి ఆధాయం తగ్గడం, సేంద్రీ విభాగం నుంచి కూడా రెవెన్యూ క్షీణించడంతోనే.. మొత్తం ఆదాయంలో క్షీణిత కనిపించిందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. కాగా శుక్రవారం నాటి టాటా కెమికల్స్  బోర్డు  సమావేశంలో స్వతంత్ర డైరెక్టర్లు చైర్మన్ సైరస్ మిస్త్రీకి ఏకగ్రీవంగా విశ్వాసాన్ని  ప్రకటించిన సంగతి తెలిసిందే.  
 

మరిన్ని వార్తలు