టుడే న్యూస్‌ రౌండప్‌

23 Aug, 2017 18:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉప ఎన్నికలో భాగంగా బుధవారం జరుగుతోన్న పోలింగ్‌లో నంద్యాల ఓటర్లు చైతన్యం ప్రదర్శించారు. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనటం విశేషం. చిన్నాచితకా ఇబ్బందులు మినహా నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. మరోవైపు ఉప ఎన్నికలో భారీగా పోలింగ్‌ జరుగుతుండటంతో తెలుగుదేశం నేతలు, శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. తెలంగాణ విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ.. అధికార పార్టీ బల సమీకరణ కార్యక్రమంలా మారిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జీవన్‌ రెడ్డి అన్నారు. అంతే కాకుండా గల్ఫ్ ఎన్నారైల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ స్పీకర్‌ సురేష్ రెడ్డి, టీ కాంగ్రెస్‌ ఎన్నారై సెల్‌ చైర్మన్‌ వినోద్‌లు ఆరోపించారు. మరిన్ని వార్తలు మీకోసం..

<<<<<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>>>

నంద్యాల ఉప ఎన్నిక అప్‌ డేట్స్‌...
చిన్నాచితకా ఇబ్బందులు మినహా నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది.

రైతుల పరిహారానికి మనసు రాదా?: జీవన్‌ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ.. అధికార పార్టీ బల సమీకరణ కార్యక్రమంలా మారిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జీవన్‌ రెడ్డి అన్నారు.

పోలింగ్‌ నాడే.. మంత్రి అఖిలప్రియ...
మహా సంగ్రామానికి నాంది కాబోతున్న నంద్యాల ఉప ఎన్నికల్లో..

టీడీపీ ఎమ్మెల్యే, డీఎస్పీ రహస్య మంతనాలు
ఉప ఎన్నికలో భారీగా పోలింగ్‌ జరుగుతుండటంతో తెలుగుదేశం నేతలు, శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.

‘టీడీపీలో చేరను, ఆ ప్రచారంలో వాస్తవం లేదు’
తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఖండించారు.

తక్షణమే ఎన్నారై పాలసీ ప్రకటించాలి: కాంగ్రెస్‌
గల్ఫ్ ఎన్నారైల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ స్పీకర్‌ సురేష్ రెడ్డి, టీ కాంగ్రెస్‌ ఎన్నారై సెల్‌ చైర్మన్‌ వినోద్‌లు ఆరోపించారు.

<<<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>

సీఎం ఊరట, ఆధారాలు లేవన్న హైకోర్టు

అవినీతి కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు హైకోర్టులో ఊరట లభించింది.

బ్రేకింగ్‌: రాజీనామాకు సిద్ధపడ్డ రైల్వే మంత్రి
మంత్రి సురేశ్‌ ప్రభు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ రైల్వేలో ఇటీవల భారీ ప్రమాదాలు చోటుచేసుకోవడం, పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలకు నైతిక బాధ్యతగా ఆయన తన పదవిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు.

విమర్శలు ఎక్కుపెట్టిన రాబర్ట్‌ వాద్రా
బికనీర్‌ భూ ఒప్పందంపై సీబీఐ విచారణకు రంగం సిద్దమవుతున్న క్రమంలో రాబర్ట్‌​ వాద్రా రాజస్థాన్‌ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు.

పళనీ.. బలపరీక్షకు సిద్ధపడు..!
అధికార అన్నాడీఎంకేలోని శశికళ వర్గం ఎమ్మెల్యేలు ఎదురుతిరగడంతో పళనిస్వామి సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది

<<<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>

భారత సంతతి సీఈవోకు జాత్యహంకార వేధింపులు

అగ్రదేశం అమెరికాలో భారత సంతతి సీఈవో జాత్యహంకార వేధింపులకు గరయ్యాడు.

ట్రంప్‌ను మార్చిన ఫొటో.. ఎందుకు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మనసు మార్చడం కష్టం.

బాంబులు వేసిన రష్యా.. ముక్కలు..
సిరియాలోని డిర్‌ ఎల్‌ జోర్‌ పట్టణంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది

<<<<<<<<<<<<<<<<<<<<<<బిజినెస్‌>>>>>>>>>>>>>>>>>>>>>>

బజాజ్‌ ‘సీటీ 100’ సరికొత్తగా లాంచ్‌

బజాజ్‌ ఆటో తన పాపులర్‌ బైక్‌ సీటీ 100 లో అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది.

2 లక్షల ఉద్యోగాలు..త్వరలో
రైలు ప్రమాదాలు, రైల్వే భద్రతపై పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో రైల్వేలో భారీగా ఉద్యోగాల కల్పనపై రైల్వే మంత్రిత్వ శాఖ దృష్ టిపెట్టింది.

మరిన్ని బ్యాంకుల విలీనం: క్యాబినెట్‌ ఆమోదం
ప్రభుత్వం రంగ బ్యాంకుల విలీనానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

గెలాక్సీ నోట్‌ 8 లాంచింగ్‌..
గెలాక్సీ నోట్‌ 7 ఫెయిల్యూర్‌తో తర్వాత, దాని తర్వాత స్మార్ట్‌ఫోన్‌గా శాంసంగ్‌ తీసుకురాబోతున్న గెలాక్సీ నోట్‌ 8 నేడే విడుదల కాబోతుంది

<<<<<<<<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>>>>>>>

మెగా మూవీకి హాలీవుడ్ టచ్

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా సై రా నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

వీహెచ్‌ x వర్మ.. ఓ అర్జున్‌ రెడ్డి
అర్జున్‌ రెడ్డి పోస్టర్‌ చించేసిన కాంగ్రెస్‌ నేత వీ హనుమంతరావు బట్టలను చించేయాలని హీరో విజయ్‌ దేవరకొండను దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కోరారు.

వినాయక చవితికి రెండో పాట
రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యుద్ధం శరణం

<<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>>>>>

మరో ఘనతకు చేరువలో విరాట్‌..
టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మరో మైలురాయికి చేరువలో ఉన్నాడు.

ఆఫ్రిది అదుర్స్.. ఫోర్లు, సిక్సర్ల వర్షం
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏడాది తర్వాత పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ షాహిద్‌ ఆఫ్రిది టి20ల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు.

మరిన్ని వార్తలు