అదరగొట్టే ఐఫోన్7 ఫీచర్లు ఇవేనట!

7 Sep, 2016 13:42 IST|Sakshi
అదరగొట్టే ఐఫోన్7 ఫీచర్లు ఇవేనట!
న్యూయార్క్ : యాపిల్ ఐఫోన్కు ఎంత క్రేజ్ అంటే... ఈ ఫోన్ కొనుకోవడమే ఓ ఫ్యాషన్గా భావిస్తుంటారు నేటి యువత. అలాంటి ఐఫోన్ తన కొత్త మోడల్తో నేడు వినియోగదారుల ముందుకు రాబోతుందట. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కస్టమర్లను అలరించడానికి శానిఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహమ్ సివిక్ ఆడిటోరియం వేదికగా  ఐఫోన్7 లాంచ్ కాబోతుంది. నేడు నిర్వహించబోయే ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఐఫోన్ 7 లాంచింగ్ ఉంటుందని యాపిల్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ,  నేడే ఈ ఫోన్ను యాపిల్ ఆవిష్కరిస్తుందని టెక్ వర్గాలు చెప్పేశాయి. అయితే ఇంత క్రేజ్ సృష్టిస్తున్న ఐఫోన్7 ఎలా ఉండబోతుందో ఓ సారి తెలుసుకుందాం... 
  • 4.7 అంగుళాల, 5.5 అంగుళాల డిస్ప్లేలతో ఐఫోన్ రెండు మోడళ్లను ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ పేర్లతో వినియోగదారుల ముందుకు యాపిల్ తీసుకు రాబోతుందట.
  • ఐఫోన్6, ఐఫోన్ 6 ప్లస్ మోడల్స్ కంటే ఇవి చాలా స్లిమ్గా కస్టమర్లను అలరించబోతున్నాయట.
  • ముందస్తు ఫోన్లతో పోలిస్తే వీటిల్లో కెమెరా క్వాలిటీ పెరుగుతుందట. డ్యూయల్ కెమెరా సిస్టమ్ కలిగి ఉండబోతున్న ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్లతో రెండు వేర్వేరు ఎక్స్పోజ్యూర్లో ఫోటోలు తీసుకోవచ్చని తెలుస్తోంది.
  • కొత్త ఐఫోన్7 ప్లస్కు రెండు కెమెరాలు 12 ఎంపీ సెన్సార్సే ఉండబోతున్నాయట. ఐఫోన్7 కు ఒకటే 12 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుందని సమాచారం.
  • రెండు కొత్త కలర్స్లో యాపిల్ ఈ సారి ఐఫోన్లను తీసుకురానుంది. అవి డీప్ బ్లూ, స్పేస్ బ్లాక్ వేరియంట్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  
  • సరికొత్త త్రీడీ టెక్నాలజీ టచ్‌తో యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కొత్తగా ఉండబోతోందట.. ప్రెషర్ సెన్సిటివ్ హోమ్ బటన్ దీన్ని ప్రత్యేకత.
  • 32 జీబీ నుంచి 256 జీబీ వరకు స్టోరేజ్ సామర్థ్యంతో, వేగవంతమైన ఏ10 ప్రాసెసర్తో ఈ కొత్త మోడల్స్ వినియోగదారుల మందుకు వస్తున్నాయి.
  • ఫోన్లకు, ఇతర ప్రొడక్ట్లకు డేటా, పవర్ ట్రాన్సఫర్ చేసుకునే విధంగా స్మార్ట్ కనెక్టర్ను ఈ ఫోన్లు కలిగి ఉంటాయని తెలుస్తోంది. 
  • సెప్టెంబర్ 16 నుంచి ఈ మోడల్స్ మార్కెట్లోకి ప్రవేశిస్తాయని, ఒక వారం నుంచి ప్రీ-ఆర్డర్లను యాపిల్ ప్రారంభిస్తుందని మార్కెట్ వర్గాల చెబుతున్నాయి
  • వాటర్ రెసిస్టెంట్ డిజైన్, మెరుగైన స్టీరియో స్పీకర్స్, అత్యధిక బ్యాటరీ కెపాసిటీ, బ్లూటూత్ సపోర్టెడ్ హెడ్ ఫోన్స్, డ్యుయల్ స్పీకర్స్, టైప్-సీ ఇంటర్ ఫేస్లు ఇవన్నీ కొత్త ఐఫోన్7లో ఉండబోతున్నాయని టాక్. స్క్రీన్కు కింద ఉన్న ఫిజికల్ టచ్ ఐడీ బటన్ను తొలగించి, నేరుగా బయోమేట్రిక్ కార్యాచరణతో ఇంటిగ్రేట్ చేయాలని యాపిల్ ప్లాన్ చేసిందట.
  • మరి ధర అనుకుంటున్నారా..? అంతర్జాతీయంగా ఆపిల్-7 బేస్ మోడల్ (32జీబీ) ధరను 749 డాలర్లుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. భారత్ లో దీని ధర సుమారు రూ. 63వేలు ఉండే అవకాశముంది.
ఈ ఫీచర్లన్నీ ఐఫోన్7లో చూడబోతున్నామో తెలుసుకోవాలంటే ఈ రాత్రి వరకు వేచిచూడాల్సిందే.
 

 

మరిన్ని వార్తలు