-
అదరగొట్టే ఐఫోన్7 ఫీచర్లు ఇవేనట!
న్యూయార్క్ : యాపిల్ ఐఫోన్‌కు ఎంత క్రేజ్ అంటే... ఈ ఫోన్ కొనుకోవడమే ఓ ఫ్యాషన్‌గా భావిస్తుంటారు నేటి యువత. అలాంటి ఐఫోన్ తన కొత్త మోడల్‌తో నేడు వినియోగదారుల ముందుకు రాబోతుందట. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కస్టమర్లను అలరించడానికి శానిఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహమ్ సివిక్ ఆడిటోరియం వేదికగా ఐఫోన్7 లాంచ్ కాబోతుంది. నేడు నిర్వహించబోయే ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఐఫోన్ 7 లాంచింగ్ ఉంటుందని యాపిల్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, నేడే ఈ ఫోన్‌ను యాపిల్ ఆవిష్కరిస్తుందని టెక్ వర్గాలు చెప్పేశాయి. అయితే ఇంత క్రేజ్ సృష్టిస్తున్న ఐఫోన్7 ఎలా ఉండబోతుందో ఓ సారి తెలుసుకుందాం... 4.7 అంగుళాల, 5.5 అంగుళాల డిస్ప్లేలతో ఐఫోన్ రెండు మోడళ్లను ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ పేర్లతో వినియోగదారుల ముందుకు యాపిల్ తీసుకు రాబోతుందట. ఐఫోన్6, ఐఫోన్ 6 ప్లస్ మోడల్స్ కంటే ఇవి చాలా స్లిమ్‌గా కస్టమర్లను అలరించబోతున్నాయట. ముందస్తు ఫోన్లతో పోలిస్తే వీటిల్లో కెమెరా క్వాలిటీ పెరుగుతుందట. డ్యూయల్ కెమెరా సిస్టమ్ కలిగి ఉండబోతున్న ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్లతో రెండు వేర్వేరు ఎక్స్పోజ్యూర్లో ఫోటోలు తీసుకోవచ్చని తెలుస్తోంది. కొత్త ఐఫోన్7 ప్లస్‌కు రెండు కెమెరాలు 12 ఎంపీ సెన్సార్సే ఉండబోతున్నాయట. ఐఫోన్7 కు ఒకటే 12 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుందని సమాచారం. రెండు కొత్త కలర్స్‌లో యాపిల్ ఈ సారి ఐఫోన్లను తీసుకురానుంది. అవి డీప్ బ్లూ, స్పేస్ బ్లాక్ వేరియంట్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సరికొత్త త్రీడీ టెక్నాలజీ టచ్‌తో యూజర్ ఎక్స్‌పీరియెన్స్ కొత్తగా ఉండబోతోందట.. ప్రెషర్ సెన్సిటివ్ హోమ్ బటన్ దీన్ని ప్రత్యేకత. 32 జీబీ నుంచి 256 జీబీ వరకు స్టోరేజ్ సామర్థ్యంతో, వేగవంతమైన ఏ10 ప్రాసెసర్‌తో ఈ కొత్త మోడల్స్ వినియోగదారుల మందుకు వస్తున్నాయి. ఫోన్లకు, ఇతర ప్రొడక్ట్‌లకు డేటా, పవర్ ట్రాన్సఫర్ చేసుకునే విధంగా స్మార్ట్ కనెక్టర్‌ను ఈ ఫోన్లు కలిగి ఉంటాయని తెలుస్తోంది. సెప్టెంబర్ 16 నుంచి ఈ మోడల్స్ మార్కెట్లోకి ప్రవేశిస్తాయని, ఒక వారం నుంచి ప్రీ-ఆర్డర్లను యాపిల్ ప్రారంభిస్తుందని మార్కెట్ వర్గాల చెబుతున్నాయి వాటర్ రెసిస్టెంట్ డిజైన్, మెరుగైన స్టీరియో స్పీకర్స్, అత్యధిక బ్యాటరీ కెపాసిటీ, బ్లూటూత్ సపోర్టెడ్ హెడ్ ఫోన్స్, డ్యుయల్ స్పీకర్స్, టైప్-సీ ఇంటర్ ఫేస్‌లు ఇవన్నీ కొత్త ఐఫోన్7లో ఉండబోతున్నాయని టాక్. స్క్రీన్కు కింద ఉన్న ఫిజికల్ టచ్ ఐడీ బటన్‌ను తొలగించి, నేరుగా బయోమేట్రిక్ కార్యాచరణతో ఇంటిగ్రేట్ చేయాలని యాపిల్ ప్లాన్ చేసిందట. మరి ధర అనుకుంటున్నారా..? అంతర్జాతీయంగా ఆపిల్-7 బేస్ మోడల్ (32జీబీ) ధరను 749 డాలర్లుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. భారత్ లో దీని ధర సుమారు రూ. 63వేలు ఉండే అవకాశముంది. ఈ ఫీచర్లన్నీ ఐఫోన్7లో చూడబోతున్నామో తెలుసుకోవాలంటే ఈ రాత్రి వరకు వేచిచూడాల్సిందే. -
ఐఫోన్ 7 లాంచింగ్‌కు ఆహ్వానాలు వచ్చేశాయ్
శాన్ఫ్రాన్సిస్కో : యాపిల్ ఐఫోన్ 7 కోసం వేచిచూస్తున్న వినియోగదారులకు వచ్చే వారంలో శుభవార్త అందనుందట. శాన్ఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహమ్ సివిక్ ఆడిటోరియంలో యాపిల్ ఓ మెగా ఈవెంట్ నిర్వహించబోతుందట. ఈ మెగాఈవెంట్లో ఐఫోన్ 7 ను వినియోగదారుల మందుకు తీసుకురానున్నట్టు ఫోర్బ్స్ నివేదిక వెల్లడిచింది. ఈ ప్రత్యేక ఈవెంట్‌కు టెక్ దిగ్గజం యాపిల్, మీడియాకు ఆహ్వానాలు పంపుతుందట. అయితే ఈ ఈవెంట్ దేనికి సంబంధించో తెలుపకుండా యాపిల్ ఆహ్వానం పలుకతుండటంతో, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, తన తర్వాతి తరం యాపిల్ వాచ్‌లను ఈ ఈవెంట్లోనే ఆవిష్కరించబోతుందని సమాచారం. సెప్టెంబర్ 9 నుంచి వీటి ప్రీ-ఆర్డర్లను యాపిల్ చేపట్టి, సెప్టెంబర్ 16నుంచి విక్రయాలు చేపట్టనున్నట్టు ఫోర్బ్స్ రిపోర్టు తెలిపింది. ఐఫోన్7 గా వినియోగదారుల ముందుకు రాబోతున్న ఈ ఫోన్, డ్యుయల్ కెమెరా, ప్రెషర్ సెన్సిటివ్ హోమ్ బటన్, బ్లూటూత్ సపోర్టెడ్ హెడ్ ఫోన్స్, డ్యుయల్ స్పీకర్స్, టైప్-సీ ఇంటర్ ఫేస్‌లు ప్రత్యేక ఫీచర్లుగా అలరించబోతున్నాయట. స్క్రీన్కు కింద ఉన్న ఫిజికల్ టచ్ ఐడీ బటన్‌ను తొలగించి, నేరుగా బయోమేట్రిక్ కార్యాచరణతో ఇంటిగ్రేట్ చేయాలని యాపిల్ ప్లాన్ చేస్తోందట.. శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన గెలాక్సీ నోట్7కు పోటీగా యాపిల్ తన ఐఫోన్‌ను విడుదల చేయనున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఫోన్ లాంచింగ్‌పై అనేక రూమర్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టబోయే ఫోన్ ఐఫోన్ 6ఎస్ఈ అని, పూర్తి రీడిజైన్డ్ ప్రొడక్ట్‌ను 2017లో యాపిల్ పదేళ్ల వార్షిక సందర్భంగా ఆవిష్కరిస్తుందని టెక్ విశ్లేషకులు అంచనావేశారు. ఈ రూమర్లన్నింటికీ సెప్టెంబర్‌లో నిర్వహించబోయే ఈ మెగా ఈవెంట్ చెక్ పెట్టనుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement