ఈ కార్ల ధరలు మూడు శాతం పెంపు

5 Dec, 2016 14:16 IST|Sakshi
ఈ కార్ల ధరలు 3శాతం పెంపు
ముంబై: టయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ (టీకెఎం)  తమ కంపెనీ మోడల్‌ కార్ల ధరలను 3 శాతం పెంచబోతున్నట్టు ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు జనవరి 1, 2017 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. జపాన్ దిగుమతులతో పాటు ముడిపదార్థాల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఫారిన్ ఎక్సేంజ్ ధరలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గత ఆరు మాసాల కాలంలో ఉక్కు, అల్యూమినియం, రాగి , రబ్బరు వంటి ముడిపదార్థ వస్తువుల ధరలు భారీగా పెరిగినట్టు పేర్కొంది.
 
టయోటా కిర్లోస్కర్ మోటార్ డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఎన్ రాజా ఒక ప్రకటనలో తెలిపారు. ముడి పదార్థాల ధరలతో పాటు జపాన్‌ యెన్‌ పెరగడంతో తమ కార్ల ధరలను పెంచాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. డాలర్ మారకపు విలువలో దేశీయ కరెన్సీ రూ.68 కిందికి దిగజారడం కూడా ధరల పెంపుపై ప్రభావితం చేసినట్టు  చెప్పారు.
 
అయితే తమ వినియోగదారులకోసం  ఆన్ రోడ్ ఫైనాన్సింగ్తోపాటు, కొన్ని ప్రత్యేక మోడళ్ల వాహనాలపై  స్పెషల్ ఈఎంఐ  సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు చెప్పారు. అలాగే బై నౌ అంట్ పే ఇన్ మార్చి 2017(ఇపుడు కొని, 2017మార్చిలో చెల్లించేలా) ఆఫర్ను కూడా అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు.
 

 

మరిన్ని వార్తలు