జుట్టు విరబోసుకుంటే పిశాచాల దాడా?

11 Apr, 2017 14:52 IST|Sakshi
జుట్టు విరబోసుకుంటే పిశాచాల దాడా?

న్యూఢిల్లీ: ఆడవాళ్లు తమ జుట్టును ముడివేయకుండా విరబోసుకున్నట్లు అలా వదిలేయకూడదట. అలా చేసినట్లయితే సెక్స్‌ ఆలోచనలు బుర్రను తినేయడమే కాకుండా బూత, ప్రేత, పిశాచాల లాంటివి ఆవహిస్తాయట. అందుకేనేమో సినిమాల్లో బూత, ప్రేత, పిశాచాలను జుట్టు విరబోసుకున్నట్లు చూపిస్తారు. జట్టును ముడేయకపోతే ఇంకా చాలా అనర్థాలే ఉన్నాయట. జబ్బు పడడం దగ్గర నుంచి మానసిక ఒత్తిడి లాంటి సమస్యలు ఉత్పన్నమవడమే కాకుండా పరాయి సంపర్కానికి కూడా దారితీసే ప్రమాదం ఉందట.

వీటన్నింటినీ  హిందూ జన జాగృతి సమితి వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. మంగళవారాలు, శనివారాలు ఆడవాళ్లు తలంటూ స్నానాలు చేయకూడదని, అలా చేసినట్లయితే అన్న దమ్ములకు హాని కలుగుతుందని కూడా హెచ్చరించారు. ఆడవాళ్లు ఎందుకు తమ జట్టును చిన్నగా కత్తిరించకోకూడదో, కనుబొమ్మలను ఎందుకు తీర్చి దిద్దుకో కూడదో వివరిస్తూ కూడా హిందూ జన జాగృతి సంస్థ ఇంతకుముందు వరుస వార్తాకథనాలను ప్రచురించింది. మహాభారతంలో ద్రౌపదీ దేవీ ఒక వారం కాదు, రెండు వారాలు కాదు, ఏకంగా 13 ఏళ్లపాటు తలంటు స్నానం చేయకుండా జట్టు విరబోసుకునే ఉంది. అందుకు ఆమెను బూత, ప్రేత, పిశాచాలు వెంటాడినట్లుగానీ, కొత్త కష్టాలు వచ్చినట్లుగాగానీ మహా భారతంలో ఎక్కడా లేదు. నిండు సభలో ధ్రుతరాష్ట్రుడు వలవలు వలచి ఆమెను అవమానించడంతో ధ్రుతరాష్ట్రుడి రక్తంతో తడిపాకే కురులను ముడుచుకుంటానని ద్రౌపది శపథం చేయడం తెల్సిందే.

అడవాళ్ల జట్టుకు సంబంధించిన అపోహలు ఒక్క హిందువుల్లోనో, హిందూ ఇతిహాసాలకో పరిమితం కాలేదు. ఇతర మతాలు, ఇతిహాసాల్లోను ఉన్నాయి. ఇప్పటికి కూడా నీగ్రో యువతుల్లో వారి జట్టు సై్టల్‌నుబట్టి వారి తల్లిదండ్రులు ఎలాంటి వారో అంచనా వేస్తారు. ఇక వారి పొట్టి ఉంగరాల జుట్టును పట్టుకున్నా, పట్టుకోమని ఎవరైనా ఆదేశించినా వారి దేశాల్లో జాతి విద్వేష నేరం అవుతుంది.

మరిన్ని వార్తలు