'తప్పుడు రేప్కేసు పెడితే శిక్షించాల్సిందే'

28 Jan, 2015 20:55 IST|Sakshi
'తప్పుడు రేప్కేసు పెడితే శిక్షించాల్సిందే'

న్యూఢిల్లీ: మహిళలు తప్పుడు రేప్ కేసు పెడితే శిక్షించాల్సిందేనని ఢిల్లీ కోర్టు పేర్కొంది. తప్పుడు రేప్ కేసుల కారణంగా నేరాల సంఖ్య పెరుగుతున్నట్టు కనబడి సమాజంలో మహిళల భద్రతపై భయాందోళన వ్యక్తమవుతుందని కోర్టు తెలిపింది.

రేప్ కేసుల్లో ఇరుక్కున్న నిందితులకు సంబంధించిన సమాచారం వెంటనే సమాజంలోకి వెళిపోతుందని, దాంతో వారు తలదించుకునే పరిస్థితులు తలెత్తున్నాయని న్యాయస్థానం వెల్లడించింది. తప్పుడు రేప్ కేసు కారణంగా నిందితులతో పాటు వారి కుటుంబాలు పరువుప్రతిష్టలు కోల్పోవలసి వస్తుందని కోర్టు పేర్కొంది. తప్పుడు రేప్ కేసులు పెట్టే మహిళలు బాధితులు కాదని, వీరిని చట్టప్రకారం శిక్షించాలని కోర్టు అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు